28.7 C
Hyderabad
April 28, 2024 10: 32 AM
Slider కృష్ణ

సెల్ఫ్ క్వారంటైన్ నుంచి జంప్ అయిన ఎన్నారై లపై క్రిమినల్ కేసు

Mylavaram

సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలు ఉల్లంఘించినందున ఇద్దరు ప్రవాస భారతీయులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కృష్ణాజిల్లా మైలవరం కు ఈ నెల 14న కొనసాని సాగర్ అలియాస్ ఐలూరి రాజశేఖర్ రెడ్డి అమెరికా నుండి వచ్చాడు.

విషయం తెలుసుకున్న రాజశేఖర్ రెడ్డిని సెల్ఫ్ ఐసోలేషన్ లో 14 రోజుల పాటు ఉండాలని సలహా ఇచ్చారు. అతనిపై పోలీసులు నిఘా ఉంచారు. నిన్న ఉదయం గ్రామ సంరక్షణ కార్యదర్శి అతని ఇంటికి వెళ్లి చెక్ చేశాడు. అయితే అతను అక్కడ లేడు. దాంతో మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు లక్కిరెడ్డి విశ్వనాథ రెడ్డి అనే వ్యక్తి కూడా మైలవరం వచ్చి ఉన్నాడు. అతనికి అదే సలహా ఇచ్చారు.

అయితే అతను కూడా హౌస్ అరెస్ట్  లో ఉండాల్సింది కానీ అతను కూడా లేడు. దాంతో అతని పై కూడా క్వారెంటైన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్188 ప్రకారం కేసు నమోదు చేశారు. విద్యా వంతులు కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ఇక కరోనా వైరస్ ఎలా అదుపులోకి వస్తుందనేది ప్రశ్న.

Related posts

దేశంలో రక్షణ కరవైన మహిళలు

Satyam NEWS

లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలి?…వీరేం చేశారో చూడండి

Satyam NEWS

ఈ నెల 31న కేబినెట్ సమావేశం

Bhavani

Leave a Comment