31.7 C
Hyderabad
May 7, 2024 01: 05 AM
Slider క్రీడలు

జాతీయ మాస్టర్స్ క్రీడల్లో 5 పతకాలు సాధించిన 55 ఏళ్ల  హెచ్.సి

#sports

విజయనగరం జిల్లా పోలీస్ శాఖ శ‌క్తి ఏంటో చూపించిన పోలీసును అభినందించిన బాస్

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన 55 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ వి.కృష్ణం నాయుడు..ఇత‌ర రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి మాస్ట‌ర్స్ అథ్లెటిక్స్ పోటీల‌లో పాల్గొని…ఒక‌టి కాదు..రెండు కాదు…ఏకంగా  అయిదు మెడ‌ల్స్ సాధించి విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ప‌వ‌రేంటో చూపించారు. 

వివ‌రాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లా కేంద్రం, అన్నా స్టేడియంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగిన 41వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 5 పతకాలు సాధించిన వి.కృష్ణం నాయుడును జిల్లా ఎం.దీపిక…డీపీఓలో  అభినందించారు.

జిల్లా పోలీసుశాఖకు చెందిన హెచ్.సి వి.కృష్ణంనాయడు ప్రస్తుతం ఎస్. కోట పోలీసు స్టేషనులో హెడ్ కానిస్టేబులుగా పని చేస్తున్నారు. ఇటీవల జాతీయ స్ధాయి మాస్టర్ అథ్లెటిక్ మీట్ తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించగా, ఏపీ  రాష్ట్రం నుండి వి. కృష్ణంనాయుడు పాల్గొన్నారు.

ఈ క్రీడా పోటీల్లో వి. కృష్ణం నాయుడు 55 + పురుషుల విభాగంలో 400 మీ||లు, 800మీ||లు, 1500మీ||లు పరుగులలో మూడు బంగారు పతకాలు, 4×400మీ||ల రిలే పరుగులో రజత పతకం మరియు 4×100మీ॥ల రిలే పరుగులో కాంస్య పతకం సాధించారు.

జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని 5 పతకాలు సాధించిన కృష్ణంనాయుడు  జిల్లా ఎస్పీ ఎం.దీపిక మేడంను మర్యాద పూర్వకంగా క‌లిసారు.ఈ సంద‌ర్బంగా , కృష్ణం నాయుడును జిల్లా ఎస్పీ అభినందించి, క్రీడలపట్ల ఆయనకు గల ఆసక్తిని, కనబర్చిన ప్రతిభను అభినందించారు.

ఒక వైపు పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తూనే మరో వైపు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో, నిరంతర సాధనతో, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని కృష్ణంనాయుడు ప్రతిభను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రశంసించారు.

Related posts

కియా మోటార్స్ కార్మికుడికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

కాంగ్రెస్‌కు అధికారమిస్తే కులగణన చేపడతాం

Satyam NEWS

పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment