39.2 C
Hyderabad
April 28, 2024 14: 07 PM
Slider జాతీయం

కాంగ్రెస్‌కు అధికారమిస్తే కులగణన చేపడతాం

#rahulgandhi

తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. వరంగల్‌  రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు అదానీకి, సీఎం కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు లాభం చేకూరుస్తారు.

తెలంగాణ రాష్ట్రం సాకారమైన తరువాత దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు లాభపడతాయని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. అందుకే మా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కులగణన చేపడతాం. ఏఏ కులాలు వెనకబాటుకు గురయ్యాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం.  భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి మొదలుకొని కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేశాను. ఆ సమయంలో ఆరెస్సెస్‌, భాజపా ప్రజలను ఏ విధంగా విభజిస్తున్నాయో అర్థమైంది.

ఇది విద్వేషాలు రగిలించే దేశం కాదు ప్రేమను పంచే దేశం అని చెప్పదల్చుకున్నా. భాజపా, భారాస ఒక్కటే. ఒకరు దిల్లీలో పనిచేస్తే.. మరొకరు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. తెలంగాణలో భాజపా నాయకులు కొన్నాళ్లు హడావిడి చేసి ఇప్పుడు చప్పుడు చేయకుండా ఉన్నారు. భారాసను గెలిపించడానికి వారు పనిచేస్తున్నారు. లోక్‌సభలోనూ ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి ఉన్న విషయాన్ని నేను సభలో గమనించాను. అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చింది.

ఇక్కడ మరో పార్టీ ఉంది. అదే ఎంఐఎం. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భాజపాతో కొట్లాడుతుందో అక్కడ ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది. భాజపా నుంచి డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కేసీఆర్‌ను గద్దె దింపడమే మా ఏకైక లక్ష్యం. ఆ తరువాత దిల్లీలోని నరేంద్ర మోడీని గద్దె దింపుతాం. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తొలి మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకొని సంతకాలు పెట్టిస్తా’’ అని రాహుల్ వివరించారు.

Related posts

ఏపీ లో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు

Satyam NEWS

జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ రాజీనామా

Satyam NEWS

స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment