40.2 C
Hyderabad
May 5, 2024 16: 58 PM
Slider ప్రత్యేకం

చౌడవాడ ఘటన… పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహకాలు

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ లో జరిగిన ఘటనలో 21 నిమిషాలలో 25 కిలోమీటర్ల వెళ్లి బాధితులను కాపాడటంలో రాత్రి పూట విధులు నిర్వహించిన పోలీసు సిబ్బంది పని తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదే విషయాన్ని గుర్తించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్..ఆ సిబ్బంది కి ప్రోత్సాహకాలు ఇవ్వాలని విశాఖ రేంజ్ డీఐజీ ని ఆదేశించారు.

ఈ మేరకు విశాఖ డీఐజీ కార్యాలయానికి విజయనగరం జిల్లా పోలీసు సిబ్బంది ని పిలిపించిన రేంజ్ డీఐజీ వాళ్ళ కు ప్రోత్సాహకాలు అందజేశారు. వివరాల్లోకి వెళితే…విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో జరిగిన సంఘటన గురించి “దిశా” ఎస్ ఓ ఎస్ కాల్ తో సమాచారం అందుకున్న పోలీసులు, సకాలంలో సంఘటనా స్థలంకు చేరుకొని, బాధితులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించి, వారి ప్రాణాలు కాపాడారు.

ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు  రేంజ్ కార్యాలయంలో వారిని ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు. రాష్ట్ర డీజిపీ గౌతం సవాంగ్, ఆదేశాలతో విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు గారు ఈ కేసులో క్రియాశీలకం గా వ్యవహరించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, పూసపాటిరేగ ఎస్ఐ కుమారి ఆర్.జయంతి, కానిస్టేబుల్ కె.దామోదరరావు, హోంగార్డు  కె. సత్యన్నారాయణలను తన కార్యాలయంకు పిలిపించి, దిశా ఎస్ ఓఎస్ కు వారు స్పందించిన తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగరావు  మాట్లాడుతూ దిశా (ఎస్ఓఎస్)కు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాల్ రావడంతో పోలీసులకు సమాచారం అందడం, రాత్రి బీట్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె.దామోదరరావు, హెూం గార్డు కె.సత్యన్నారాయణరావులు అధికారుల ఆదేశాలతో వర్షం పడుతున్నా, తడుస్తూ, వారున్న ప్రాంతానికి 25 కి.మీ.ల దూరంలో ఉన్న సంఘటనా స్థలానికి కేవలం 21 నిమషాల్లోనే చేరుకున్నారన్నారు. బాధితులను ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో వెంటనే వారు కాలిన గాయాలతో ఉన్న ముగ్గురు బాధితులను ఆటోలో భోగాపురం సీహెచ్ సీ చికిత్స నిమిత్తం తరలించారన్నారు.

అక్కడ ప్రాధమిక చికిత్స అందించిన తరువాత బాధితులను 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత కల్పించడంలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక కూడా సమయానుకూలంగా స్పందించి, సంఘటన తీవ్రతను పెద్ది కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి, నిందితుడ్ని 10గంటల వ్యవధిలోనే అరెస్టు చేసారని డీఐజీ ప్రశంసించారు.

ఈ కేసులో బాధితులకు చికిత్స అందించేందుకు, అదే విధంగా నిందితుడ్ని త్వరితగతిన పట్టుకొని, అరెస్టు చేసేందుకు విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, పూసపాటిరేగ ఎస్ఐ  కుమారి ఆర్.జయంతి, కానిస్టేబులు కె.దామోదరరావు, హెూం గార్డు కె.సత్యన్నారాయణలను విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు  ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం

Related posts

క‌రోనాతో మ‌రో పోలీసు మృతి….! అదీ ఓ ఏఎస్ఐ….!

Sub Editor

అనధికార బ్లాస్టింగ్ లు ఆపాల్సిందే లేకుంటే చర్యలు తప్పవు

Satyam NEWS

ఆదివారం స్పెషల్: అద్భుత రవి పుష్య యోగం

Satyam NEWS

Leave a Comment