39.2 C
Hyderabad
May 4, 2024 19: 22 PM
Slider విజయనగరం

పోలీసులు నిర్వహించే స్పందనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్నంటే…!

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” ను జిల్లా ఎస్పీ ఎం. దీపిక నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

“స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 23 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. విజయనగరం కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తాను నగరంలోని ఒక జ్యూవెలరీ షాపు యజమాని వద్ద . 20వేలు నగదుకు పుష్య రాగం పొడిని కొనుగోలు చేసానని, అది జెమాలజిస్టుతో పరీక్ష చేయించగా, నకిలీదిగా నిర్ధారణ అయ్యిందని, దీనిపై షాపు యజమానిని ప్రశ్నించగా, సదరు వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించేందుకు నిరాకరించాడడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 1వ వన్ టౌన్  సిఐను నిర్ధారించారు.

విజయనగరం జొన్నగుడ్డికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను 85 వేలు నగదు ను తన ప్రాంతానికి చెందిన వ్యక్తికి చేబదులుగా ఇచ్చినట్లు, ఏడాది  పూర్తయినప్పటికీ తన డబ్బులను తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని వన్ టౌన్ సిఐను ఆదేశించారు.

విజయనగరం బూడివీధికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు విజయనగరం తోటపాలెంకు చెందిన వ్యక్తితో 2016లో వివాహం అయ్యిందని, అతడు గతంలో కూడా ఒక అమ్మాయిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని, సదరు విషయం మా పెండ్లి కుదుర్చిన వ్యక్తికి తెలిసియున్నప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా తనను మోసం చేసారని, వారిరువురిపైన చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని టూటౌన్ సిఐను ఆదేశించారు.

విశాఖపట్నంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన సోదరి అత్తవారి వేధింపులు భరించలేక 2022లో ఆత్మహత్య చేసుకుందని, కాలక్రమంలో నిందితులు తన సోదరి పిల్లల సంరక్షణకు వారి ఆస్తిలో వాటాను ఇస్తామని అగ్రిమెంటు చేయడంతో, సదరు కేసులో రాజీ అయ్యామని, కానీ, నిందితులు ఇప్పుడు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొబ్బిలి డిఎస్పీని ఆదేశించారు. ఎస్.కోట మండలం బొడ్డవర కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమ ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు భూమిని కొనుగోలు చేసేందుకు డబ్బులను అడ్వాన్సుగా ఇచ్చినట్లు, సదరు వ్యక్తి భూమి రిజిస్ట్రేషను చేయకపోవడంతో డబ్బులు తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎస్.కోట సిఐను ఆదేశించారు. సీతానగరం మండలం ఇప్పలవలస కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త బెట్టింగులకు అలవాటు పడి, తమ సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, అతనిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బొబ్బిలి డిఎస్పీని ఆదేశించారు.

ఇలా స్పందన స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బీ సిఐ జె. మురళి, ఎన్బీ సిఐ సిహెచ్. రుద్రశేఖర్, డిసిఆర్బి ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

142జీవో సవరించి స్థానిక దినపత్రికలకు న్యాయం చేయండి

Bhavani

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

మంత్రి ఆదేశంతో సెల్లార్ నీటిని క్లియర్ చేసిన అధికారులు

Sub Editor

Leave a Comment