29.7 C
Hyderabad
May 2, 2024 04: 59 AM
Slider వరంగల్

మిషన్ వాత్సల్య కోసం అనాధ బాలలు దరఖాస్తు చేసుకోవచ్చు

#Mission Vatsalya

బాల కార్మిక వ్యవస్థ, బాల అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా భారత ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం నూతన మార్గదర్శకాలను విడుదల చేసిందని ములుగు జిల్లా సంక్షేమాధికారిణి ఇ.పి. ప్రేమలత తెలిపారు. అనాథలు, పాక్షిక అనాథలు, నిరాదరణకు గురవుతున్న (అభాగ్యులు) బాలలు, తల్లితండ్రులు/పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, HIV ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారులు, పెన్షన్ సౌకర్యం పొందని దివ్యాంగులైన చిన్నారులు, పేదరికం కారణంగా బడి బయట ఉన్న బాలలు, అభాగ్యులు, నిరరాదరణకు గురవుతున్న బాలలు, అసహాయ స్థితిలో (ఇన్ కెపాసిటేటేడ్) ఉన్న కుటుంబాలకి చెందిన బాలలుకు విద్య, ఆరోగ్యం మరియు పౌష్టికాహార అవసరాలను తీర్చడానికి ఈ పథకం నిర్దేశించారు.

వారు నిరాటంకంగా చదువుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యం తో భారత ప్రభుత్వం అలాంటి బాలలకు వారి కుటుంబ స్థితిగతులు, వారి విద్య, ఆరోగ్య అవసరాల ఆధారంగా నిర్దేశించిన కాలానికి నెలకి రూ.లు 2000/- చొప్పున సాయం అందచేస్తారు. గతం లో జిల్లా లో పైన తెలిపిన వివిధ వర్గాలకు చెందిన బాల బాలికలు 39 మందికి రెండు విడతలుగా మొత్తం రూ. లు 6,76,000/- ( అక్షరాల ఆరు లక్షల డెబ్బది ఆరు వేల రూపాయలు) స్పాన్సర్షిప్ కోసం చెల్లించారు.

ప్రస్తుతం మిషన్ వాత్సల్య నూతన మార్గదర్శకాలు 2022 ప్రకారం అర్హులైన బాల బాలికలకి ఒక్కరికి నెలకి 4,000/- చొప్పున నిర్దేశించిన కాలం పాటు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పైన తెలిపిన వర్గాలకి చెందిన అర్హులైన బాలలు సంవత్సరం లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులను నిర్దేశించిన దరఖాస్తు పత్రములో పూరించి అవసరమైన అర్హత ధృవ పత్రాలతో సహా స్థానిక అంగన్వాడీ టీచర్ ని సంప్రదిస్తే బాలల వివరాలు జిల్లా బాలల పరిరక్షణ విభాగం– ములుగు కి పంపిస్తారని, అనంతరం స్పాన్సర్షిప్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఆధారంగా వాటిని జిల్లాస్థాయి స్పాన్సర్షిప్ మరియు పోస్టర్ కేర్ అఫ్రువల్ కమిటీ కి సమర్పించడం జరుగుతుందని, కలెక్టర్ చైర్మన్ గా ఉన్న ఈ కమిటీ పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఉన్న బాలలకు స్పాన్సర్షిప్ కొరకు కమిటీ ఆమోదం తెలుపుతుందని జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత వివరించారు.

ఈ స్పాన్సర్షిప్ దరఖాస్తు ప్రక్రియ విషయంలో ఏమైనా సందేహాలుంటే 9491701330, 9440615158 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా సూచించారు.
స్పాన్సర్షిప్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన పత్రాలు:
అనాథలు/పాక్షిక అనాథలు అయినట్లయితే మరణించిన తల్లితండ్రుల మరణ ధృవీకరణ పత్రాలు,
2). బాలల స్టడీ సర్టిఫికెట్,
3). కులము, ఆదాయం మరియు నివాస ధ్రువీకరణ పత్రాలు.
4). బాలల వ్యక్తిగత బ్యాంకు ఖాతా/ తల్లి లేదా సంరక్షకుల తో జాయింట్ అకౌంట్.
5). బాలల ఆధార్,
6). తల్లి/ సంరక్షకుల ఆధార్,
7). తల్లి/ సంరక్షకులతో కూడిన తెల్ల రేషన్ కార్డు,
8) బాలుడు/బాలిక పాస్ ఫోటో.
9). గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ (VCPC) తీర్మానం/సిఫార్సు లేఖ.

Related posts

బతుకు యుద్ధంలో…

Satyam NEWS

పవనిజం: కింగా?? కింగ్ మేకరా??

Satyam NEWS

కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్  స్వాధీనం

Satyam NEWS

Leave a Comment