28.7 C
Hyderabad
April 28, 2024 08: 51 AM
Slider తూర్పుగోదావరి

142జీవో సవరించి స్థానిక దినపత్రికలకు న్యాయం చేయండి

స్ధానిక దినపత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మార్చిన 142 జి.వో సవరించి పత్రికలే జీవనాధారంగా మనుగడ కొనసాగిస్తున్న పబ్లిషర్లు మరియు ఎడిటర్లకు న్యాయం చేయాలని ఎడిటర్స్ అసోషియేషన్ మంగళవారం కాకినాడ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఏపీ బిసీ సంక్షేమశాఖ,సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు వినతి పత్రం అంద జేశారు. ముందుగా ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరు సత్కారం చేసి అసోసియేషన్ లెటర్ పాడ్ ను మంత్రి , కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భ ముగా ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పితాని వెంకట రాము రాష్ట్రంలో స్థానిక దినపత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్రంలో స్ధానిక దిన పత్రికల ద్వారా కొన్ని వేల మంది ఆధారపడి జర్నలిజమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం వారు ఇచ్చే రాయితీలు జీ.వో కారణంగా అందడం లేదని, ప్రభుత్వం ద్వారా సమాచార శాఖ వారు ఇచ్చే అక్రిడేషన్‌ సంపూర్ణ స్ధాయిలో ఇవ్వాలని, గతంలో ఏ జిల్లాలో రిజిష్ట్రేషన్‌ ఐన పత్రికలు ఆయా జిల్లాల్లో కోనసాగుతున్న దినపత్రికలకు ఆయా జిల్లాల పరిధిలో ఎంత మంది రిపోర్టర్లు ఆయా దినపత్రికల్లో పనిచేస్తున్నారో అంత మందికి అక్రిడేషన్‌ ఇచ్చేవారని అదేవిధంగా మంజూరు చేయించే విధంగా మంత్రి చర్యలు తీసుకుని స్ధానిక దినపత్రికలకు ఊపిరి పోయాలని కోరారు.

అలాగే ఎడిటర్లు,పబ్లిషర్లు,స్టాఫ్‌ రిపోర్టర్లకు స్టేట్‌ వైడ్‌ అక్రిడేషన్‌ ఇచ్చే విధంగా మంత్రి చర్యలు తీసుకుని స్ధానిక పత్రికల మనుగడకు న్యాయం చేయాలని కోరారు. ఒక్కో దినపత్రికలోనూ జిల్లా పరిధిలో 10 నుండి 25 మంది జర్నలిస్టులు ఆయా మండలాల్లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు,ప్రజా సమస్యలు నిరంతరం ప్రచురిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారని, ఒక్కో జర్నలిస్టు తమ పరిధిలో వందలాది మంది ప్రజలకు,ప్రజా ప్రతినిధులకు తన సమాచారాన్ని చిన్న పత్రికల ద్వారా ప్రభావితం చేస్తారని అన్నారు. ప్రభుత్వ ప్రకటనలు,ఇళ్ల స్ధలాలు ఇచ్చి ఆర్ధిక బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. ప్రస్తుత తరుణంలో పత్రికల ముద్రణ కష్టతరంగా ఉన్న కారణంగా 142 జీవో సవరించి న్యాయం చేయాలని కోరారు. విషయాలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పునరాలోచించి స్ధానిక దినపత్రికలకు న్యాయం చేయాలని కోరారు. ఎడిటర్లు,పబ్లిషర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి వేణు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎడిటర్స్ అసోషియేషన్ గౌరవ అధ్యక్షులు కోనేటి శ్రీనివాస్,అధ్యక్షులు పితాని వెంకట రాము,ప్రధాన కార్యదర్శి పుర్రె త్రినాథ్,కోశాధికారి ఏ.జయశ్రీను,న్యాయ సలదారులు పి.వేణుబాబు, కార్యవర్గ సభ్యులు ఖండవల్లి సునీల్ కుమార్,మోర్త బాల కుమార్,ఏ.వెంకట రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జంట‌న‌గ‌రాల‌లో టీఎస్ఆర్టీసీ హోం డెలీవ‌రీ సేవ‌లు

Sub Editor

అక్రమంగా ఇసుక తరలిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లు?

Satyam NEWS

త్వరలో భారీ చేరికలు

Murali Krishna

Leave a Comment