28.7 C
Hyderabad
May 5, 2024 10: 54 AM
Slider విజయనగరం

శ్ర‌మ‌దానం చేసిన హోంగార్డుల‌ను అభినందించిన ఎస్పీ దీపిక‌

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం  జిల్లాకు వ‌చ్చి మూడేళ్ల అయిన విజ‌య‌న‌గ‌రం పోలీస్ బాస్ ఎస్పీ అయిన దీపిక ,హోంగార్డుల‌కు దేవ‌త‌గా, ఓ అమ్మ‌గా  నిలిచారు. అదీ డీపీఓలో క‌మ్యూనికేష‌న్ వింగ్ కు చెందిన అద‌న‌పు గ‌ద‌లు నిర్మాణంలో హోంగార్డులు చమ‌టోడ్చి శ్ర‌మ‌దానం చేసారు. వార క‌ష్టాన్ని గుర్తించిన ఎస్పీ, ప్ర‌త్యేకించి వారిని అభినందించ‌డ‌మే కాక‌..కొత్త బ‌ట్ట‌లు ఇవ్వ‌డం నిజంగా అభినందీయ‌మ‌ని అంటోంది..” స‌త్యం న్యూస్.నెట్…”. “.విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో గల కమ్యూనికేషన్ విభాగంకు నిర్మించిన అదనపు గదులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ ఎం.దీపిక కు కమ్యునికేషన్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి, పుష్ప గుచ్ఛంలను అందజేసారు. అనంత‌రం ఎస్పీ దీపిక‌ నూతనంగా నిర్మించిన గదుల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ కమ్యూనికేషన్ విభాగంలో పని చేసే మహిళా సిబ్బంది వేచి ఉండేందుకు మరియు కమ్యూనికేషన్ విభాగం పరికరాలను ఉంచేందుకు స్టోర్ రూం అవసరమని తెలపడంతో, తక్కువ వ్యయంతో అన్ని సౌకర్యాలను సమకూర్చి, రెండు గదులను శ్రమదానంతో నిర్మించి, వాటిని కమ్యూనికేషన్ విభాగంకు అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు.

వీటిని కమ్యూనికేషన్ సిబ్బంది సద్వినియోగం చేసుకొని, చక్కగా వినియోగించుకోవాలని కోరారు. కమ్యునికేషన్ సిబ్బందికి ఇంకను అవసరమైన అదనపు సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ  ఎం.దీపిక ఆదేశించారు. అనంతరం, గదుల నిర్మాణంకు శ్రమదానం చేసిన పోలీసు సిబ్బంది, హెూంగార్డులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రత్యేకంగా అభినందించి, వారికి క్రొత్త బట్టలను ప్రధానం చేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ట్రెయినీ  మండ జావలి అల్ఫాన్స్, డిఎస్పీలు డి.విశ్వనాధ్, ఆర్.గోవిందరావు, ఆర్.శ్రీనివాసరావు, యూనివర్స్, సిఐలు కే.కే.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, జె.మురళి, శ్రీకాంత్ యాదవ్, ఆర్ఐలు శ్రీనివాసరావు, గోపాలనాయుడు, రమణమూర్తి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, కమ్యూనికేషన్ ఎఎస్ఐ సోమేశ్వరరావు, కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనాను జయించిన ములుగు యువకుడు

Satyam NEWS

సీఎం పర్యట‌నా సభా స్థలిని పరిశీలించిన డీఐజీ

Sub Editor

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశంసాపూర్వక నిర్ణయం

Bhavani

Leave a Comment