34.2 C
Hyderabad
May 14, 2024 21: 56 PM
Slider విజయనగరం

విజయనగరం లో విచిత్రం..”సత్యం న్యూస్. నెట్ “కు చిక్కిన చిత్రం..

#trafficpolice

ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విధులు చూస్తే అంతే మరి…!

మీరు చదివింది నిజమే.. రోడ్ల పై ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు చేసిన విధులు ఏంటీ కొత్త గా చెబుతున్నారేంటని అనుకోకండి.. అదేంటి ట్రాఫిక్ ను జామ్ అయిన రోడ్ల ను…అదే రోడ్ల పై ప్రమాదాలు జరగకుండా.. ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి మరీ చూడాల్సిన ట్రాఫిక్ సిబ్బంది ఇలా ఎడ్లను కర్ర పట్టుకుని మరీ విధులు నిర్వర్తించడం ఆశ్చర్యం గా ఉంది కదూ.

మరి ఉండదా… అప్పుడెప్పుడో బ్రిటన్ కాలం నాటి పోలీసు మ్యాన్యువల్ ను అసలు మారకుండా అమలవుతున్న ఈ తరుణంలో.. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విధులు చూస్తే అలాగే ఉంటుంది. పోలీసు శాఖ లో ఉన్నతాధికారులు ఏం చెబితే అది తు.చ తప్పకుండా పాటించాల్సిందే. అలాగే ఆ విధంగా విజయనగరం లో ట్రాఫిక్ ఉన్నతాధికారి..చెప్పిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు.. ట్రాఫిక్ పోలీసులు.

కరోనాతో గడచిన రెండేళ్ల గా ఏ శాఖ లో కూడా అంతగా దిగివ స్థాయిలో ఏ ఒక్కరూ సరిగ్గా విధులు నిర్వర్తించలేదు.ఇక ఆ కరోనా పోవడంతో ప్రజలంతా తమ తమ విధుల్లో నిమగ్నమవడం అలాగే అన్ని శాఖల అధికారులు సిబ్బంది తమతమ విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం చేత కర్ర పట్టుకుని.. నడిరోడ్లపై ఆవులను తోలడం..విజయనగరం లో విచిత్రంగా నగర ప్రజలకు అగంపించింది.

నగరంలో న్యూపూర్ణ ,దాసన్నపేట రింగ్ రోడ్ల జంక్షన్ వద్ద ఎస్ఐలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా కర్రలు పట్టుకుని మరి..సిగ్నల్స్ ఉన్న…ఆ సందర్భంలో నే..జంక్షన్ ల మధ్య.. ట్రాఫిక్ సిబ్బంది కర్రలు పట్టుకుని ఆవులను తోలడంతో అక్కడి ప్రజలు.. ఔరా అని నోరెళ్లబెట్టడం కనిపించింది.

అదే సమయంలో అక్కడే ఉన్న సత్యం న్యూస్. నెట్ ప్రతినిధి.. టక్కున తన కెమెరా కు పని చెప్పడంతో ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు.. ఆవును కర్రతో తోలి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఏదైనా విజయనగరం లో ట్రాఫిక్ పోలీసులు.. అటు ఉన్నతాధికారులు ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ.. రోడ్ల పై ట్రాఫిక్ నియమనిబంధనలను అతిక్రమించిన వాహనాలు వాటిని నడిపిస్తున్న చోదకులపై ఫైన్ లు విధించాల్సిన ట్రాఫిక్ పోలీసులు.. కర్ర పట్టుకుని రోడ్ల పై ఎడ్లను తోలడం విచిత్రం కాక ఇంకేమని అంటోంది… సత్యం న్యూస్. నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

విపక్షాలపై పగ సాధించడం మంచిది కాదు

Satyam NEWS

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు

Bhavani

కుమార్తె మోసం…పోలీసు క్రౌర్యం..ఫలితం ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment