37.7 C
Hyderabad
May 4, 2024 14: 24 PM
Slider జాతీయం

Special Story: విశాఖ పోర్ట్ పైనా కరోనా ప్రభావం

#VisakhaPortTrust

2019- 20 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికార్గో  హ్యాండ్లింగ్ చేసిందని  విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహనరావు తెలిపారు. 2018 -19 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ చేసిన 65.30 మిలియన్ టన్నుల తో పోల్చుకుంటే కార్గో హ్యాండ్లింగ్  11 శాతం అధికం అని చెప్పారు.

87 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖ పోర్ట్ లో జరుగుతున్నా ప్రగతి,కార్గో హ్యాండ్లింగ్,భవిష్యత్ కార్యాచరణ ,కాలుష్య నివారణ చర్యలు ,ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలను ఆలయం వివరించారు. విశాఖ పోర్ట్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో విశాఖ పోర్ట్ మిగతా పోర్టుల కన్నా ముందుందన్నారు.

పోర్టు కమ్యూనిటీ సిస్టం మాడ్యూల్ ను అమలు చేయడంతో పాటు  అవసరం అనుకున్న వారికి ఆన్ లైన్ ద్వారా డాక్యుమెంట్లను సమర్పించే అవకాశం కల్పించామన్నారు. వాహనాలను త్వరగా తరలించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ధరలను సరళీకరణ చేశామని చెప్పారు.

కంటైనర్లు నేరుగా పోర్టులోకి ప్రవేశించటం నేరుగా సరుకు డెలివరీ చేసే విధానం అమలు చేస్తున్నామన్నారు. రాత్రి సమయంలో లో సరకు రవాణా  అనుకూలంగా ఉండేందుకు ఫనా మాక్స్ స్పెషల్స్ యొక్క డ్రాఫ్ట్ను 14 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామన్నారు.

ఇన్నర్  హార్బర్ లో విశాల్ యొక్క భీమ్ ని 30.  25 మీటర్ల నుంచి 38 మీటర్లకు పెంచామని చెప్పారు.  విశాఖ పోర్టులో సరుకు రవాణా పై కరోనా  ప్రభావం ఉందన్నారు.  2020 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్  వరకు 245 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశామని  ఇదే 2019 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 294 మిలియన్ టన్నుల చేశామని తెలిపారు.

మొత్తంగా సరుకు రవాణాలో 16.5 శాతం తక్కువ నమోదైందని వెల్లడించారు. సరుకు రవాణా తగ్గుదల పరంగా చూసుకుంటే మిగిలిన అన్ని మేజర్ పోస్టుల కంటే కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తక్కువ తగ్గుదలను నమోదు చేసిందని తెలిపారు.

ఆర్థిక మందగమనం కారణంగా విద్యుత్ రంగంలో సరుకు రవాణాలో చెప్పుకోదగిన తగ్గుదల నమోదైందన్నారు.  స్టీమ్ గోల్డ్ కుకింగ్ రూట్ మరియు కంటైనర్ కార్గో లో ఈ తగ్గుదల నమోదైందని . ఇనుప ఖనిజం, పెల్లెట్స్, బొగ్గు రవాణా, ఎరువులు, ఇనుము, కంటైనర్ ఎగుమతుల్లో వృద్ది నమోదు అయ్యిందని వివరించారు.

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం చేస్తున్న నిరంతర ప్రక్రియల వల్ల ఎరువుల ఎగుమతుల్లో వృద్ధి నమోదవుతోందన్నారు.

పటిష్ట భద్రత నడుమ అమ్మోనియం నైట్రేట్ నిర్వహణ

విశాఖ పోర్టులో పటిష్ట భద్రత నడుమ అమ్మోనియం నైట్రేట్ నిర్వహణ చేస్తున్నామని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహనరావు స్ప్రష్టం చేశారు. అమ్మోనియం నైట్రేట్  హ్యాండ్లింగ్ వలన ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదాని కేంద్ర ప్రభుత్వం సూచించిన 29 పాయింట్లతో కూడిన భద్రత చర్యలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు.

విశాఖ ప్రజలు ఎటువంటి బయన్దోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఎరువుల గ్రేడ్ కు  వినియోగించే అమోనియం నైట్రేట్ లో బ్యాగులలో దిగుమతి చేస్తున్నామన్నారు.

చట్టపరమైన ఏజెన్సీ ల అనుమతుల తర్వాత మాత్రమే అమ్మోనియం నైట్రేట్ ను దిగుమతి చేసుకునేందుకు విశాఖపట్టణం పోర్ట్ ట్రస్టు అనుమతిస్తుందని స్ప్రష్టం చేశారు. అమ్మోనియం నైట్రేట్ కు సంబంధించి విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ లో ఎటువంటి స్టోరేజి సదుపాయము కల్పించడం  లేదని చెప్పారు. 

అమ్మోనియం నైట్రేట్ దిగుమతి చేసుకునే సమయంలో అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లుతో పాటు బెర్త్ మొత్తాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతారని తెలిపారు.

భవిష్యత్ అభివృద్ధి ప్రాజెక్టులు

633 కోట్ల రూపాయలతో తో నిర్మిస్తున్న కంటైనర్ టెర్మినల్ విస్తరణ కార్యక్రమం పురోగతిలో ఉందని  2021 మార్చి నాటికి ఇది  పూర్తి కావలసి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అవుతుందని  ఈ విస్తరణ కార్యక్రమం పూర్తయితే కంటైనర్ టెర్మినల్ అదనంగా మరో 5.4 లక్షల టన్నుల  రవాణా చేయనుందని  పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహనరావు తెలిపారు.

168 కోట్ల రూపాయలతో ఓ ఆర్ వన్ లో ఆ రెండు బెర్తుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని  ఆధునికీకరణ పూర్తయితే ఈ టెర్మినల్ ద్వారా 80 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్ ట్యాంకర్లను నిర్వహించే వీలు కలుగుతుందన్నారు .180 కోట్ల రూపాయలతో సి హార్స్ జంక్షన్ నుంచి డాక్ యార్డ్  ఏరియా వరకు నాలుగు కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ అభివృద్ధికి డీపీఆర్ తయారీ అయ్యిందని చెప్పారు.

110 కోట్ల రూపాయలతో ఈస్ట్ బ్రేక్ వాటర్ నుంచి  నాలుగు లైన్ల కనెక్టివిటీ రహదారి అభివృద్ధికి డి పి ఆర్ తయారీ సిద్దమైందన్నారు. మేజర్ పోర్టు అథారిటీ బిల్లు వలన   మారుతున్న  మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆస్తులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పోర్టులకు మంచి అవకాశం కల్పిస్తోందని అన్నారు.

కాలుష్య నివారణకే  తొలి ప్రాధాన్యత

విశాఖపట్నం పోర్టు ట్రస్టు కాలుష్య నివారణను తొలి ప్రాధాన్యతగా తీసుకుని కార్యాచరణను కొనసాగిస్తోందని   పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామ్మోహనరావు తెలిపారు.  . నగరానికి ఆనుకున్న ఉన్న పోర్టు కావడంతో కాలుష్య నివారణ , పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలను  నిరంతర ప్రక్రియగా చేపడుతోందని, బొగ్గు ఇనుము వంటి కార్గో హ్యాండ్లింగ్ ను పూర్తిగా యాంత్రీకరణ చేయడం కోసం పిపిపి మోడ్ లో 2 వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ  ఖర్చు చేసిందని చెప్పారు.

నిల్వ కేంద్రాల చుట్టూ గ్రీన్ బెల్ట్ అభివృద్ది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోందని .గత మూడేళ్లలో పచ్చ దనాన్ని పెంపొందించేందుకు  10.50 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకూ 4 లక్షల 50 వేల మొక్కలను పెంచామని చెప్పారు.

2020-21 కి 1.02 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు . నిల్వ కేంద్రాల నుంచి దుమ్ము ధూళి నగరంపైకి ఎగర కుండా నిల్వ కేంద్రాల చుట్టూ 24 కోట్ల రూపాయలతో కాన్వేంట్ జంక్షన్ నుంచి ఎన్ హెచ్ 8 జంక్షన్ వరకూ 4.2 కిలోమీటర్ల వరకూ  11.5 మీటర్ల ఎత్తైన గోడను నిర్మించామన్నారు.

పోర్ట్ పరిసరాల్లో కాలుష్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు కవర్డ్ స్టాక్ యార్డ్ ల నిర్మాణం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. . ప్రస్తుతం దీనికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించామని  త్వరలోనే ఇది కార్య రూపం దాల్చనుందని తెలిపారు.

Related posts

సీపీఎస్ ఇచ్చిన మాట తప్పారా…. పూర్తిగా మరిచారా …?

Satyam NEWS

శ్రీశైలం లో సకల శుభప్రదాయిని కాత్యాయని దేవి దర్శనం

Satyam NEWS

కాన్ఫిడెన్స్: దేశమంతా ఎంఐఎం గాలి వీస్తోంది

Satyam NEWS

Leave a Comment