29.7 C
Hyderabad
April 29, 2024 09: 57 AM
Slider నిజామాబాద్

కాన్ఫిడెన్స్: దేశమంతా ఎంఐఎం గాలి వీస్తోంది

owaisi

ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాలేదని దేశమంతా ఎంఐఎం గాలి వీస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేయకుండా మజ్లీస్ కు మద్దతు తెలపాలని కోరారు. తన తండ్రి హయాంలో నుంచే ఎంఐఎం పార్టీ ఉందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆరుగురు ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అన్నారు.

ఎంఐఎం పోటీలో ఉంటే కాంగ్రెస్, బీజేపీలకు భయం పట్టుకుందన్నారు. మజ్లీస్ పార్టీ ప్రజల సమస్యల మీద 70 సంవత్సరాలుగా పోటీ చేస్తుందని తెలిపారు. మజ్లీస్ పోరాడితే హిందు, ముస్లింల మధ్య మత కల్లోహాలు సృష్టిస్తుందని ఆరోపిస్తున్నారని తెలిపారు. కామారెడ్డిలో ముస్లిం ఓటర్లు తప్ప ఇతర ఓటర్లు శబ్బిర్ ఆలీకి ఓటు వేయలేదని చెప్పారు. ప్రస్తుతం కలలో కూడా ఎంఐఎం పేరు కలవారిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తనకు ఇద్దరు భార్యలు ఉన్నారని ప్రచారం చేసారని, ఒక్క భార్యతోనే పరేషాన్ ఉంటే రెండవ భార్యను ఎలా చేసుకుంటానని ఛలోక్తి విసిరారు. అసదుద్దీన్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతోందని వాళ్ళు భయపడుతున్నారని అన్నారు. అమేటి నుంచి ఓడిపోతే కేరళలో వెళ్లి గెలిచిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. నాయకుని కాపాడుకోలేని వాళ్ళు నాతో ఏం పోరాడతారని విమర్శించారు.

దేశంలో 3 స్థానాల్లో ఎంఐఎం గెలిచిందని గుర్తు చేశారు. 30 సంవత్సరాలుగా గెలిచిన కాంగ్రెస్ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుందని చెప్పారు. బీహార్ లో నితీష్ కుమార్ ఓటమికి తానే కారణమని, అయినా ఒక్కసారి కూడా కాంగ్రెస్ వాళ్లు కృతజ్ఞత కూడా చెప్పలేదన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఎంఐఎం పోటీలో ఉంటే బీజేపీ ఓడిపోయిందన్నారు. ఎన్నార్సీ పోవరసత్వ బిల్లుల పేరుతో దేశప్రజాలలో మోడీ ప్రభుత్వం అభద్రతభావాన్ని కలుగజేస్తుందన్నారు. దేశమంతా ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. యోగి ప్రభుత్వం 25 మంది ముస్లింలను పొట్టన పెట్టుకుందని విమర్శించారు. మృతికి సంబందించిన పోస్టుమార్టం నివేదికను ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవం లాంటిదని విమర్శించారు. కామారెడ్డిలో ఆరుగురు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Related posts

హై కోర్ట్ కాలనీ టు హెచ్ఎంటి నగర్ లింక్ రోడ్డును పునః ప్రారంభించాలని కేటీఆర్ కి వినతి

Satyam NEWS

పల్స్ పోలియో ను విజయవంతం చేయండి

Satyam NEWS

పర్యావరణపై చిత్రాలేఖనానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment