30.7 C
Hyderabad
April 29, 2024 07: 00 AM
Slider సినిమా

యూట్యూబ్ లో రాంగ్ గోపాల్ వర్మ ‘మాయ’

#WrongGopalVarma

ఒకసారి యూట్యూబ్ లో అప్ లోడ్  అయిన  ఆడియో గానీ వీడియో గానీ  శాశ్వతంగా ఉండిపోతుంది. కారణాంతరాల వల్ల యూ ట్యూబ్ యాజమాన్యం  తొలగిస్తే తప్ప  అది వన్ క్లిక్ అవే గా అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో  అందుకు భిన్నమైన సంఘటన ఒకటి చర్చనీయాంశం అయింది.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు “రాంగ్ గోపాల్ వర్మ” అనే టైటిల్ తో ఒక వివాదాస్పద చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా…ఆ చిత్రం లోని “వర్మ వర్మ వర్మ… ఓ రాంగ్ గోపాల్ వర్మ ” అనే టైటిల్ సాంగ్  విడుదలైంది.

ఎవరు హ్యాకింగ్ చేశారో…?

అయితే రెండవ రోజుకు 7 వేల వ్యూస్ వచ్చిన ఆ పాట…  మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 3 వ తారీఖు సాయంత్రానికి యూట్యూబ్ నుండి మాయమైంది. తొలుత ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది అనుకున్న “రాంగ్  గోపాల్ వర్మ” చిత్ర దర్శకనిర్మాత జర్నలిస్ట్ ప్రభు  మూడు రోజుల తర్వాత కూడా  ఆ పాట యూట్యూబ్ లో కనిపించకపోవడంతో దానిని మార్కెట్ లో  విడుదల చేసిన ఆడియో కంపెనీని సంప్రదించగా  ‘సౌత్ అమెరికా లోని ఒక గ్యాంగ్  ఆ పాటను హ్యాక్  చేశారు.. యూట్యూబ్ చరిత్రలోనే ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం.. ఇలా ఎందుకు జరిగిందో … ఎవరు చేశారో తెలియదు.. రెండు మూడు రోజుల్లో రెక్టిఫై   చేస్తాం…వెరీ సారీ ‘ అన్నారు.

కానీ రెండు వారాల తర్వాత మాత్రమే ఆ పాట మరలా  యూ ట్యూబ్ లో కనిపించింది.  తొలిసారి హ్యక్  జరిగింది అని చెప్పినప్పుడు 7000 వ్యూస్  సాధించిన ఆ పాట రెండవసారి రీలోడ్ అయినప్పుడు కేవలం మూడు రోజుల్లోనే 54 వేల  వ్యూస్ పొందింది.  అయితే ఈసారి పాట వస్తుంది గానీ   గత 15 రోజుల నుండి అదే 54వేల మీద స్ట్రక్ అయింది తప్ప అడుగు ముందుకు పడలేదు.

మరలా ఆడియో కంపెనీ సంప్రదించగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.. ప్రమోషన్ చేస్తున్నాము.. కానీ ఏదో జరుగుతుంది.. మాకే అంతుపట్టడం లేదు…. we are very sorry అంటూ తమ  నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇలా ఒక లోడెడ్ కంటెంట్ ఒకసారి హ్యక్  అవ్వటం ,మరొకసారి స్టక్ అవ్వటం యూట్యూబ్ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు.

అయితే ఆడియో కంపెనీ అభ్యర్థన  మేరకు ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకువెళ్ళటానికి దర్శకనిర్మాత ప్రభు అంగీకరించకపోవడంతో..ఆ పాట మరొకమారు కిల్  చేశారు.

ఇలా జరగటం చిన్న విషయం కాదు ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు.. కాబట్టి ఈ విషయాన్ని యూట్యూబ్ అథారిటీ దృష్టికి తీసుకు వెళ్ళమని మీడియా మిత్రులు సలహా ఇవ్వడంతో  ఆ మేరకు జరిగిన విషయాన్ని వివరిస్తూ ఈ ప్రెస్ నోట్ జారీ చేశారు  ‘రాంగ్ గోపాల్ వర్మ ‘ చిత్ర దర్శకనిర్మాత జర్నలిస్ట్ ప్రభు.

ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోనే ఇలా జరగలేదు అంటున్న నేపథ్యంలో ఈ పాట యూట్యూబ్ నుండి మాయమవటం పట్ల యూట్యూబ్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో… దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉంటే దాన్ని వెనక్కి తీస్తుందో లేదో చూడాలి.

Related posts

సీఎం కప్ – 2023 లోగో ఆవిష్కరించిన మంత్రి

Bhavani

సూపర్ స్టార్ కృష్ణ మృతి వార్త పై దిగ్భ్రాంతి

Bhavani

(Over The Counter) Holistic Medicines Diabetes Does Cinnamon Control Blood Sugar

Bhavani

Leave a Comment