37.7 C
Hyderabad
May 4, 2024 14: 01 PM
Slider ముఖ్యంశాలు

గాంధీభవన్ ను ముట్టడించిన భజరంగ్ దళ్

#bhajarangdal

భజరంగ్ దళ్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐతో పోల్చడాన్ని నిరసిస్తూ భజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. బుధవారం ఉదయం 10:30 నుంచి విడతలు విడతలుగా నాలుగుసార్లు గాంధీభవన్ ముట్టడించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముస్లిం సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులపై విషం చిమ్మడాన్ని నిరసిస్తూ భజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసింది.

భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు నేతృత్వంలో భాగ్యనగర్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ను ముట్టడించారు. వందలాది మంది పోలీసులు మోహరించినా మెరుపు దాడికి దిగారు.  ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి భజరంగదళ్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చారు. అక్రమ కేసులు బనాయించి పలు పోలీస్ స్టేషన్ లకు తిప్పారు. బొల్లారం, బేగంబజార్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. భాగ్యనగరంలో దాదాపు 300 మంది కార్యకర్తలు ముట్టడిలో పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. పోలీసుల కళ్ళుగప్పి గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన శివరాములు రాత్రి నుంచి పహారాల్లో ఉన్న పోలీసులను తప్పించుకొని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు గాంధీభవన్ చేరుకున్నాడు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం చుట్టుముట్టి శివరాములును బంధించాలని చూసినా పోలీసుల కళ్ళు కప్పి కార్యాలయం నుంచి గాంధీభవన్ చేరుకున్నాడు. దీంతో ఈస్ట్ జోన్ డిసిపి సునీల్ దత్, మిగతా పోలీస్ యంత్రాంగం విహెచ్పి కార్యాలయానికి వచ్చి కార్యాలయం అంతా తనిఖీలు చేశారు. కింది స్థాయి సిబ్బందిని డిసిపి తీవ్రంగా మందలించారు.

కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం

ఉగ్రవాద మూలాలు కలిగిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా  (PFI) వంటి ఉగ్రవాద సంస్థతో భజరంగ్ దళ్ ను పోల్చడం దుర్మార్గమని భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్రను కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హిందువులపై మరోసారి విషం చిమ్మిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ ను ఉగ్రవాద సంస్థ అయిన  పి ఎఫ్ ఐ తో పోలుస్తూ.. భజరంగదళ్ పై నిషేధం విధించడం నీచమైన ప్రక్రియ అన్నారు.

ముస్లింల సంతుష్టీకరణ కోసం హిందువులను అవమానించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ విద్వేషాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశా మని శివ రాములు పేర్కొన్నారు.  హిందువులంతా సంఘటితమై కాంగ్రెస్ ను తుదముట్టించాలన్నారు. ప్రతి హిందువు స్పందించి కాంగ్రెస్ ముక్తభారత్ చేయాలన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

చెట్లు పుట్టలు చెత్తా చెదారంతో నిండిపోయిన హిందూ స్మశాన వాటిక

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న డాక్టర్ రెడ్డీస్ పై సైబర్ దాడులు

Satyam NEWS

స్కూల్ ఎన్నికల నిర్వహణపై కార్యశాల

Bhavani

Leave a Comment