27.7 C
Hyderabad
May 4, 2024 07: 40 AM
Slider విజయనగరం

పైడితల్లి జాతర: తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు

#ashokgajapatiraju

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూర్య కుమారి తన కుటుంబం తో అమ్మవారిని దర్శించుకున్నారు. విజయనగరం ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం..అయిన పైడితల్లి అమ్మవారిని ఆలయ అనువంశిక ధర్మకర్త మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా అమ్మవారి ని ఇచ్చిన సమయానికి సరిగ్గా ఉదయం 8 గంటలకు దర్శించుకున్నారు.

అదే విధంగా ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ.. విజయనగరం పైడితల్లి అమ్మవారి దర్శనానికి వచ్చారు. భారీ కాన్వాయ్ తో నగరంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మ దర్శనానికి విచ్చేశారు. దీంతో డీఎస్పీ లు త్రినాథ్, మోహన్ రావు లు భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కల్పించడం.. దీనికి తోడు భారీ కాన్వాయ్ తో దాదాపు 12 కార్లతో దర్శనానికి వచ్చారు అమ్మవారికి డిప్యూటీ స్పీకర్.. డిప్యూటీ సీఎం లు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు.

విజయనగరం పైడితల్లి అమ్మవారికి సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు తాకిడి ఎక్కవైంది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల సందర్భంగా అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు… దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణలు .అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా. హరి జవహర్ లాల్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తదితరులు ఉన్నారు.

పైడితల్లి అమ్మవారినీ దర్శించుకున్న రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, శాసన సభ్యులు బడు కొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ రఘు రాజుదర్శించుకున్నారు.

Related posts

30వేల మందికి పైగా గాంధీ చిత్ర వీక్షణ

Bhavani

22 పోలీస్ స్టేష‌న్లు…443 కిలోమీట‌ర్లు..విజయనగరం జిల్లాలో దిశ జాగృతియాత్ర‌

Satyam NEWS

వి ఎస్ యూ లో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి

Satyam NEWS

Leave a Comment