27.7 C
Hyderabad
May 4, 2024 09: 50 AM
Slider జాతీయం

ఎవ్వరినీ వదిలిపెట్టను.. శశికళ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకుడా ఉండేందుకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చినంత మాత్రాన జరిగేదేమీ లేదని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. త్వరలోనే అందరికీ సమాధానం చెబుతానని అన్నారు. తనను అడ్డుకోలేరని, మీరెవరూ భయపడవద్దని అన్నాడీఎంకే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు చిన్నమ్మ శశికళ.

అన్నాడీఎంకే రాజ్యాంగాన్ని మార్చడంపై స్పందించారు చిన్నమ్మ శశికళ. తాను పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవిని చేపట్టకుండా మార్పులు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చడంతో పార్టీకి పునర్‌ వైభవం రావడం కష్టమన్నారు.

తనను వ్యతిరేకించే వారికి చిన్నమ్మ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తానెవరికి భయపడటం లేదని, మీరూ భయపడొద్దు అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. త్వరలోనే అందరికీ సమాధానం చెబుతానని శశికళ వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శశికళ. కాగా, చిన్నమ్మ ఎంట్రీని శాశ్వతంగా అడ్డుకునేలా అన్నాడీఎంకే రాజ్యాంగాన్ని మర్చేసింది పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ద్వయం. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రీసిడియం ఛైర్మన్‌గా తమిళ మాగన్‌ హుస్సేన్‌‌ను నియమించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీపై పళనిస్వామి, పన్నీర్‌సెల్వంకే పట్టు ఉండేలా రాజ్యాంగాన్ని మార్చేశారు.

Related posts

బద్వేల్ జాతీయ రహదారిపై ప్రమాదంలో ఒకరి మృతి

Satyam NEWS

9 ఏళ్ల ప్రధాని మోడీ పాలన లో ఏం చేశామంటే….!

Satyam NEWS

పసర నూతన ఇన్స్పెక్టర్ గా వంగపల్లి శంకర్

Satyam NEWS

Leave a Comment