33.2 C
Hyderabad
May 15, 2024 19: 37 PM
Slider ముఖ్యంశాలు

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా శక్తివంతమైనది

#india

ఓటు విలువ గురించి అవగాహన కల్పించేందుకు సిబిఐటి  ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ విద్యార్థులు సిబ్బందితో ఇంటరాక్టివ్ ఈవెంట్‌ను నిర్వహించింది. మన ఓటు ఎంతో విలువైనది అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ ఈవెంట్ లో భాతంగా భారతదేశ మ్యాప్‌లో భారత దేశ పతాకం రంగులను విద్యార్ధులు బొటనవేలు తో ముద్రించారు. ప్రజల ఐక్యతకు ఇది ప్రతీక అని వారన్నారు. ప్రతి బొటనవేలు ముద్ర, చిన్నది అయినప్పటికీ, రంగులతో సంపన్న భారతదేశాన్ని నవ నిర్మాణ  దిశగా ఒక అడుగు వేయడాన్ని ఇది సూచిస్తుంది అని విద్యార్ధులు తెలిపారు. మన వ్యక్తిగత అభిప్రాయాలతో బాటు సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరు చేసే కృషి ఏకీకృతమైనప్పుడు దేశంలో విశేషమైన పరివర్తనలను తీసుకురాగలవని    ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్  జిఎన్ఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.నాగ ప్రపూర్ణ, డా.ప్రసన్న రాణితోపాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. స్టూడెంట్ ప్రెసిడెంట్ భాను ప్రసాద్ క్లబ్ తమ క్లబ్ సభ్యుల కృషి ని అభినందించారు. క్లబ్‌కు నిరంతరం మద్దతు మరియు ప్రోత్సాహం అందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ కు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు

Satyam NEWS

నోబుల్ కాజ్: ప్లాస్టిక్ రహితంగా మేడారం జాత‌ర‌

Satyam NEWS

కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి మోక్షం

Satyam NEWS

Leave a Comment