38.2 C
Hyderabad
May 2, 2024 21: 51 PM
Slider నల్గొండ

ఘనంగా మాజీ భారత ప్రధాని పి.వి.నర్సింహారావు జయంతి

#PV Narasimha Rao

మాజీ భారత ప్రధాని పి.వి.నర్సింహారావు జయంతి వేడుకలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాచిమంచి గిరిబాబు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైల్వే జోనల్ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్,సాముల శివారెడ్డి, మాజీ జడ్పీటిసి గల్లా వెంకటేశ్వర్లు తదితరులు పి.వి.చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ 1921 జూన్ 28న,జన్మించిన పాములపర్తి వెంకట నర్సింహారావు భూసంస్కరణలకు అనుగుణంగా తన భూమిని పేదలకు పంపిణీ చేసిన మహనీయుడు అని శ్లాఘించారు.

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ,ఇందిరాగాంధీ ఆలోచనలు అమలు చేయడంలో పి.వి.పాత్ర శ్లాఘనీయమని అన్నారు.బహుభాషా కోవిదునిగా, రచయితగా, భారతదేశ 9వ,ప్రధానమంత్రి గా 1991 – 1996 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని నిశ్చలంగా నడుపుతూ ఆర్ధిక సంస్కరణలో భారతదేశాన్ని అగ్ర వరుసలో ఉంచిన దక్షిణాత్యుడు పాములపర్తి వెంకట నరసింహారావు అని అన్నారు.

న్యాయ కోవిదునిగా ప్రసిద్ధి చెందిన పి.వి.నర్సింహారావు భారతదేశ ప్రధాని మొదటి తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణం అని అన్నారు.భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతున్న సమయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టిన గొప్ప రాజనీతిజ్ఞుడు పి‌వి.అని అన్నారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో,కేంద్రంలో ఎన్నో అత్యున్నతమైన పదవులు నిర్వహించి పదవులకే వన్నెతెచ్చిన పాములపర్తి వెంకట నరసింహారావు మనందరికీ చిరస్మరణీయుడు అని,వారి బాటలో పయనించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల మల్లయ్య, ముశం సత్యనారాయణ,సమ్మెట సుబ్బరాజు,కోలా మట్టయ్య,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,చింతకాయల రాము,బంటు సైదులు, మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు ఇంటిమళ్ళ బెంజిమెన్,కస్తాల సైదులు,పోతనబోయిన రామ్మూర్తి, రెడపంగు రాము,ఎ.సుదర్శన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

రైల్వే ప్రైవేట్ పరం చేయాలన్న యోచనను విరమించుకోవాలి

Satyam NEWS

సాగర్ నీరు సమృద్ధిగా ఇవ్వాలి

Murali Krishna

“మల్లేశం” దర్శకనిర్మాత నుంచి “8 ఎ.ఎమ్. మెట్రో” రేపే విడుదల

Bhavani

Leave a Comment