27.7 C
Hyderabad
May 4, 2024 07: 54 AM
Slider జాతీయం

అజంఖాన్ ఓటు హక్కు రద్దు

#azamkhan

సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత అజంఖాన్‌ ఓటరు హక్కును రద్దు చేశారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించారు. డిసెంబర్ 5న జరగనున్న రాంపూర్ ఉప ఎన్నికల్లో ఆజం ఖాన్ ఇకపై ఓటు వేయలేరు. బుధవారం నాడు, ఆజం ఖాన్ ఓటు హక్కును రద్దు చేయాలని బిజెపి అభ్యర్థి ఆకాష్ సక్సేనా డిమాండ్ చేశారు. దీనిపై రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్‌డిఎం సదర్‌కు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఉద్రేకపూరిత ప్రసంగం చేసిన కేసులో ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌ సభ్యత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆజం ఖాన్ దోషిగా నిర్ధారించబడినందున  ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ఒక నేరస్థుడికి ఓటు హక్కు నిరాకరించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటరు జాబితా నుంచి ఆజంఖాన్ పేరును కూడా తొలగించారు.

Related posts

మద్యం అక్రమంగా తరలిస్తున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

(Natural) | Hemp Bombs Cbd Capsules 2000mg Cbd Hemp Flower Scanner

Bhavani

అద్భుత అవకాశం

Satyam NEWS

Leave a Comment