29.7 C
Hyderabad
April 29, 2024 08: 23 AM
Slider కవి ప్రపంచం

అద్భుత అవకాశం

#K.Harinath

నగరం చౌరస్తాలో
కనిపించే కటౌట్లు కూల్చుతూ
ప్లెక్సీలను చింపి పార్టీల పరువుతీసే
ప్రబుద్ధుల సాక్షిగా
దూషణ భూషణలతో
వావి వరస లేకుండా
పార్టీ పరంగా వ్యక్తిగతంగా
తిట్ల పురాణాల చిట్టాలు విప్పుతూ
కంపుకొట్టే మతోన్మాద
విషరాజకీయ నాయకుల సాక్షిగా
పార్టీకి పార్టీకి మధ్య కక్షలు
కార్పణ్యాలతో కత్తులు నూరుతూ
ప్రతి పక్షాల గొంతు నులుముతూ
అధికార దాహంతో విర్రవీగే
అధికార పార్టీల సాక్షిగా
డబ్బును ఎరవేసి ఓటును కొనాలనే
సిగ్గులేని రాజకీయ
దౌర్భాగ్యుల సాక్షిగా
ఫ్యామిలీకింతని ప్యాకేజీ ఎరవేసి
రిటర్న్ గిఫ్ట్ ఇమ్మంటూ
మాయాజాలంతో గాలం వేసి
ఓటరుకి మసిబూసి
మారేడు కాయజేసే
నాయక మహాశయుల సాక్షిగా
ఓ… ఓటర్
ఇప్పుడు నీకో అవకాశం వచ్చింది
సిగ్గులేని రాజకీయ నాయక
మూకల నూరుమాడేందుకు
తరిమి తరిమి కొట్టే
ఓ… అద్భుత అవకాశం నీకిచ్చింది
అసలైన సిసలైన మంచి
నాయకుడిని మంచి పార్టీని ఎన్నుకునే
సదవకాశం నీ కొచ్చింది
నీ ఓటు దుర్వినియోగం కాకుండా
సద్వినియోగం చేసుకో
మనిషిగా మసులుకో…

కొరుప్రోలు హరనాథ్
9703542598

Related posts

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన బిచ్కుంద ఎంపిడిఓ

Satyam NEWS

పెండింగ్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

జె.సి.ఐ వారోత్సవాలలో నేత్రదానం హర్షణీయం

Satyam NEWS

Leave a Comment