27.7 C
Hyderabad
May 7, 2024 07: 47 AM
Slider మహబూబ్ నగర్

అనవసరంగా బయటకు వస్తున్న  వారిపై కేసు నమోదు

#wanaparthypolice

9వ రోజు లాక్ డౌన్ సందర్భంగా వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తా, రాజీవ్ చౌరస్తా, బస్టాండ్, రామాలయం,  పెబ్బేరు, వివిధ ప్రాంతాల్లో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆకస్మిక తనిఖీ చేసి  లాక్ డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించి,పలు వాహనదారులను ఆపి తనిఖీ చేసి వారు బయటకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని వారికి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోన కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా ఈ నెల 30వ  తేదీ వరకు  లాక్ డౌన్ అమల్లో ఉంటుదన్నారు.

ఈ కోవిడ్,లాక్ డౌన్ నిబంధనలు  పాటిస్తూ మాస్క్ లు ధరించి, బౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు కరోన నియంత్రనకు సహకరించాలని కోరారు.

విజృంభిస్తున్న కరోన వైరస్ పై  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్ డౌన్ పాటించాలని పోలీసులు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్న  అనవసరపు కారణాలు చెబుతూ వివిధ పనులకు బయటకు రావడం కొంతమంది మందికి సరదాగా మారిందని చెప్పారు. 

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి వలన కళ్ళముందే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మృతి చెందుతున్న బాధ్యతారాహిత్యంగా అవగాహన రాహిత్యంగా ఏలాంటి కారణాలు లేకుండా రోడ్ల మీదకు వచ్చి  అత్యవసర పనులకోసం ఆపదలో బయటకు వచ్చే వారికి ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

ఇటువంటి విపత్కర సమయాలలో నిబంధనల ఉల్లంఘన చేయడం అత్యంత బాధ్యారాహిత్యం అని ప్రజలు గ్రహించాలని అన్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు వెసులుబాటు ఇచ్చిన సమయంలో ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్ ధరించాలని, బౌతిక దూరం పాటించాలి ఉదయం పది గంటల లోపుగా దుకాణాదారులు తమ కార్యకలాపాలను పూర్తి చేసుకోవాలని కోరారు. ఆపైన ఒక్క నిమిషం ఆలస్యమైనా నిబంధనల ఉల్లంఘనగా భావించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. భౌతిక దూరం పాటించడంలో దుకాణాదారులతో పాటుగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు కరోనా అంటువ్యాధి వలన జరుగుతున్న విధ్వంసం, కష్టనష్టాలనూ చూస్తూ కూడా, నిబంధనలు, చట్టం పట్ల నిర్లక్ష్యంగా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించే  వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తూ వాహనాలు సీజ్ చేస్తాం అన్నారు.

పోలీసులు చలాన్ విధించడం, వాహనాలు సీజ్ చేయడం కోసమే పని చేయడం లేదని, పోలీసులు కట్టడి చేస్తున్నది కఠినంగా వ్యవహరిస్తుందని కేవలం ప్రమాదకరంగా ఉన్న కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసమే అని ప్రజలు అర్ధం చేసుకొని పోలీసులకు సహకరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ, కిరణ్ కుమార్, వనపర్తి సీఐ, ప్రవీణ్ కుమార్, వనపర్తి పట్టణ ఎస్సై, మధుసూదన్,  శిక్షణ ఎస్సైలు, నరేష్ కుమార్, శ్రీకాంత్, నస్రీన్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

దేశ సమస్యలపై నీలాదీస్తాం

Bhavani

హైకోర్టు ఎదుట హాజరైన మరో నలుగురు ఐఏఎస్ అధికారులు

Satyam NEWS

భద్రాచలానికి రూ. వెయ్యి కోట్ల హామీ ఏమైంది..?

Bhavani

Leave a Comment