39.2 C
Hyderabad
May 3, 2024 13: 50 PM
Slider ప్రత్యేకం

ఆనందయ్య కరోనా మందుకు ఏపి ప్రభుత్వం అనుమతి

#krishnapatnam

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం లో కరోనాకు ఆయుర్వేదం మందు పంపిణీ చేస్తున్న బొణిగి ఆనందయ్య కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అందజేస్తున్న మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణపట్నం ఆయుర్వేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదని ఆయన తెలిపారు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే తెలిపారు.

Related posts

రెవెన్యూ బిల్లు ఆమోదం పట్ల మంత్రుల హర్షం

Satyam NEWS

కార్మికులను బానిసత్వం లోనికి నెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది

Satyam NEWS

అధికారుల అండదండలతో రేషన్ బియ్యం దందా

Satyam NEWS

Leave a Comment