29.2 C
Hyderabad
November 8, 2024 14: 48 PM
Slider సంపాదకీయం

ప్రొటెస్ట్: నేను రాను బిడ్డో వైజాగు సచీవాలయానికి

secretariat

రాజధానిని విశాఖపట్నంకు తరలించడంపై ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి ఏమిటి? ఏమో, ఎవరైనా తెలుసుకుంటే కదా తెలిసేది. రాజధానిని తరలించేందుకు కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గురించి వారి కుటుంబాల గురించి పట్టించుకునే ఉద్దేశ్యంలో లేనట్లే కనిపిస్తున్నది.

హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన నాలుగేళ్లకే మళ్లీ వైజాగ్ పోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వైజాగ్ వెళ్లేందుకు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నా కూడా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పైగా సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. దాంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధపడుతున్నారు.

28 సంవత్సరాల సర్వీసు ఉంటే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవచ్చుననే క్లాజును ఉపయోగించుకుని ఉద్యోగాలు వదిలేయడానికి చాలా మంది సిద్ధపడుతున్నారు. విఆర్ఎస్ తీసుకోవడానికి గత పిఆర్సిలో చెప్పిన సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే చాలా విభాగాల ఉద్యోగులు పిఆర్సీలో ఏమేం సిఫార్సులు ఉన్నాయో తమ కన్నా సీనియర్లను ఉపయోగించి తెలుసుకుంటున్నారు.

మరి కొందరు ఇప్పటికే విఆర్ఎస్ కు దరఖాస్తులు పెట్టుకోగా వాటిని సంబంధింత సెక్షన్ ఆఫీసర్లు తిరస్కరిస్తున్నారని తెలిసింది. 22, 23 తేదీలలో విశాఖపట్నం వెళ్లాల్సిందేనని అప్పటి వరకూ సెలవు కూడా ఇచ్చేది లేదని వారు అంటున్నారు. బాధ్యతల నుంచి రిలీవ్ చేసేందుకు అవకాశం ప్రస్తుతానికి లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమకు పైనుంచి మౌఖిక ఆదేశాలు వస్తున్నాయని అందువల్ల తాము కూడా రైటింగ్ లో ఇవ్వలేమని అంటున్నారు.

ఆఖరు నిమిషంలో లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చి 12 గంటల్లో ఉద్యోగాలలో చేరేలా ప్లాన్ చేస్తున్నందున ఉద్యోగులకు వేరే ఆప్షన్ ఉండదని అంటున్నారు. విఆర్ఎస్ తీసుకోవాలంటే విశాఖ పట్నంలో ఉద్యోగంలో చేరి ఒక నెల జీతం తీసుకోవాలి. అప్పుడుగానీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండదు.

అది కూడా ఉన్నతాధికారులు రిలీవ్ చేస్తేనే వీలవుతుంది. అన్నీ సక్రమంగా జరిగితేనే పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. అందుకోసం ఉన్నతాధికారులు చెప్పినట్లు విని విశాఖపట్నం వెళ్లి జాయిన్ అయిన తర్వాత సెలవు పెట్టి ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుందామని ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తే వారి భవిష్యత్తుపై క్లారిటీ వస్తుంది. ప్రభుత్వంలో పని చేసే వారికే ప్రస్తుతం క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన తర్వాత దాదాపుగా 20 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. 28 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారిలో ఒక్కరు కూడా ప్రభుత్వంలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదు.

Related posts

Be careful: రెండు రోజులు మండించబోతున్న ఎండ

Satyam NEWS

ట్రాప్ రేప్: యువతిఫై 6 గురు మైనర్ ల అకృత్యం

Satyam NEWS

తాగి డ్రైవ్ చేసిన 10 మందిని అదుపులోకి..!

Satyam NEWS

Leave a Comment