33.2 C
Hyderabad
May 12, 2024 12: 12 PM
Slider ప్రత్యేకం

196 ల‌క్ష‌ల వ్య‌యంతో  విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద వాట‌ర్ ట్యాంక్

#ministerbotsa

పుర‌పాల‌క సంఘ శాఖ మంత్రి బ‌దులు…విద్యాశాఖ మంత్రి చే ఓపెనింగ్…!

విజ‌య‌న‌గర ప్ర‌జ‌ల‌కు మ‌రో మంచి నీటి ప‌థ‌కం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది..జ‌గన్ ప్ర‌భుత్వం. న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద‌..196 ల‌క్ష‌ల వ్య‌యంతో ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద  కేంద్రానికి సంబంధించి అమృత్ ప‌థ‌కంలో భాగంగా  రాష్ట్ర ప్ర‌జారోగ్య, పుర‌పాల‌క సాంకేతిక శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన  మంచి నీటి ర‌క్షిత ట్యాంక్ ను స్థానిక మంత్రి అయిన విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు.

ముందుగా ఇచ్చిన స‌మ‌యానికి క‌న్నా…గంట ఆల‌స్యంగా వ‌చ్చి….ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ తో పాటు, ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, మేయ‌ర్, విజ‌య‌ల‌క్ష్మి,డిప్యూటీ మేయ‌ర్లు…ఎంఎల్.సీలు  జేసీ మ‌యూరీ అశోక్, 33 వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ రంగా త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా విద్యాశాఖ మంత్రి బొత్స మాట్లాడుతూ…కేంద్ర  అమృత్ మ‌హోత్స‌వ్ ప‌థ‌కంలో బాగంగా మ‌రీ ముఖ్యంగా న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మంచి నీటి స‌ర‌ఫ‌రా మ‌రింత చేరువ‌య్యేందుకు  మంచి నీటి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. సామాన్య ప్ర‌జానీకం..200 వెచ్చిస్తే.. త‌క్ష‌ణం మంచి నీటి కుళాయి ఇస్తున్నామ‌ని…గ‌త ప్ర‌భుత్వం… ఆ క‌మిటీలు..ఈ క‌మిటీల‌తో కాల‌యాప‌న చేయ‌డమే త‌ప్ప‌…నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో…అస్స‌లు ప‌ట్టించుకోలేద‌న్నారు.

ఈ  మూడేళ్ల‌లో త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చి…అట్ట‌డుగు వారి క‌ష్టాల‌ను తెలుసుకోవ‌డ‌మే కాక‌..స‌ర్పంచ్ నుంచీ  అదే న‌గ‌రం ప‌ట్ట‌ణాల‌లో కౌన్స‌ల‌ర్,  కార్పొరేట‌ర్ నుంచీ మంత్రి వ‌ర‌కు…అలాగే  గుమ‌స్తా నుంచీ క‌లెక్ట‌ర్ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ అనునిత్యం ప్ర‌జా క్షేత్రంలోనే ఉంటున్నామ‌న్నారు. వారి బాధ‌లు,క‌ష్టాలు తె లు\ఉకుంటూ… త‌ద‌నుగుణంగా వారి స‌మ‌స్య‌ల‌ను తీర్చుతున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని మంత్రి బొత్స అన్నారు.

స్పెష‌ల్ టాస్క్ పోర్స్ తో పోలీసు బందోబ‌స్తు..!

న‌గ‌రానికి  అదీ ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద  ఇద్ద‌రు రాష్ట్ర మంత్రుల‌చే మంచినీటి ప‌థ‌కం ప్రారంబోత్స‌వం జ‌రుగుతుంద‌న్న స‌మాచారం మేర‌కు…ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌ను  చోటు చేసుకోకుండా..స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ (ఎస్.టీ.ఎఫ్) తో డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో   సీఐ,న‌లుగు ఎస్ఐల‌తో గ‌ట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది…పోలీసు శాఖ‌.

విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ  త్రినాద్ శెలవులో ఉండ‌టంతో.ఎస్పీ,ఎస్టీ డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్య‌ర్యంలో పోలీస్ శాఖ ఈ బందోబ‌స్తు నిర్విహించింది. ఉదయం 09.30 కు  మంత్రి చే ప్రారంంభం జ‌రుగుతుంద‌ని స‌మాచారం ఇచ్చిన‌ప్ప‌టికీ… పుర‌పాల‌క శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ రాక‌పోవ‌టంతో.. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు.

ఇక  బాంబ్ స్క్వాడ్…ముందుగానే వ‌చ్చి…వాట‌ర్ ట్యాంక్ మొత్తం జాగిలాలతో త‌నిఖీలు చేసారు.మ‌రి కాసేప‌ట్లో మంత్రులు వ‌స్తార‌న‌గానే…బీడీఎస్.. మెషిన్ ఏర్పాటు చేసి ప్ర‌తీ ఒక్క‌రినీ త‌నిఖీలు చేసి మ‌రీ స‌భా  ప్రాంగంణ‌లోకి పంపారు. ఏదైనా ముప్పావు గంట‌ ఆల‌స్యంగా కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంద‌నే చెప్పాలి.

Related posts

అమరా ప్రసాద్ దిష్టబొమ్మ దహనం

Bhavani

శంకరమ్మకు MLC పదవి?

Bhavani

కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి

Bhavani

Leave a Comment