తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఇదే మనందరి లక్ష్యమని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. గడప గడపకూ కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని ఖమ్మం లోని 23వ డివిజన్ ముస్తఫా నగర్ లో పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి నిర్వహించారు.
తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా మువ్వా పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మలీదు జగన్, మియా భాయ్, ఇమామ్ భాయ్, దుంపల రవి కుమార్, వాలూరి ఝాన్సీ, మందడపు తిరుమలరావు, బాణాల లక్ష్మణ్, చింతమళ్ళ గురుమూర్తి , శ్రీకళా రెడ్డి, కాంపాటి వెంకన్న, ప్రతిభ, చల్లా రామకృష్ణ రెడ్డి, చల్లా రామకృష్ణ, తోట ప్రసాద్, హరీష్, స్వరూప, ప్రసాద్, రాము, తిరుపతమ్మ, నరసింహారావు, సుజాత, అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.