Slider నెల్లూరు

ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో సమస్యలను తీర్చేస్తాం

#government hospital

ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యలన్నిటిని తీర్చి వేస్తామని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో అన్ని శాఖల అధిపతులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యలన్నిటిని ఎంపీ ఆదాల దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎంపి ఆదాల మాట్లాడుతూ3 నెలల క్రితమే పలు సమస్యలు నా దృష్టికి వచ్చాయని, వాటిని వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే 19 లక్షల రూపాయలను అప్పటికప్పుడు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించారని సంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆస్పత్రిలోని ఆయా విభాగాల అధిపతులు సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ విషయమై విజయవాడ వెళ్లి సంబంధిత మంత్రితో మాట్లాడి, ఆయనను ఇక్కడికి రప్పిస్తామన్నారు.

తద్వారా సమస్యలకు పరిష్కారాన్ని చెబుతామని పేర్కొన్నారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ సీట్ల విషయమై ఈనెల 20వ తేదీ ఢిల్లీ వెళ్ళినప్పుడు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని చెప్పారు.

ఆస్పత్రి నిర్మాణ సమయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఈ భవనాలను అద్భుతంగా నిర్మించామని చెప్పారు.

ఆసుపత్రి డాక్టర్లు రోగుల పట్ల శ్రద్ధ వహించి అంకితభావంతో పనిచేసి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఆసుపత్రి విభాగాల అధిపతులు చెప్పిన విషయాలను తెలుసుకొని తప్పకుండా పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు.

విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధా నాయక్, డీఎంహెచ్ఓ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీ సునంద పాల్గొన్నారు.

కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, అవినాష్, నూనె మల్లికార్జున యాదవ్, మోబినా వైసిపి నేతలు రియాజ్, కోటేశ్వర్ రెడ్డి,పాశం శ్రీనివాసులు, నరేంద్ర రెడ్డి, ఆర్ఎస్ఆర్, అల్లా బక్షు, శ్రీకాంత్ రెడ్డి, సూరిబాబు, యేసు నాయుడు, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

Sub Editor

ఆన్ డ్యూటీ:బస్సు లోనే గుండె పోటుతో కండక్టర్ మృతి

Satyam NEWS

విశాఖలో మరో విషాదం: కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి

Satyam NEWS

Leave a Comment