40.2 C
Hyderabad
May 5, 2024 15: 28 PM
Slider ప్రత్యేకం

సంక్షేమo, అభివృద్ధి రెండు కళ్ళు

#shadimubarak

రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు లాగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, బంజర, ములగుడెం, రజబ్అలీ నగర్, కేవీ బంజర, మంగ్యా తండా, దొనబండ గ్రామలలో మంత్రి పువ్వాడ విస్తృతంగా పర్యటించారు.ఆయా గ్రామాల్లో మొత్తం రూ.2.90 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్స్, సీసీ సైడ్ డ్రైన్స్, డొంక రోడ్లను విస్తరించి మట్టి రోడ్లుగా అభివృద్ది, కల్వర్టులు, మంగ్య తండా, ములగుడెం, దొనబండ గ్రామ పంచాయతీ భావనలను ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కిట్స్ ను యువత కు పంపిణి చేశారు. వీటితో పాటు పలు అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

గ్రామ కూడళ్లలో నూతనంగా ఎర్పాటు చేసిన హై మాస్ట్ లైట్స్ ను స్విచ్చ్ ఆన్ చేసి ప్రారంభించారు. పంగిడి గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు రూ.29 లక్షలతో చేపట్టిన ఏడు అభివృద్ది పనులకు, ఎస్డిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. ట్రాన్సకో నిధులు రూ.24 లక్షలతో చేపట్టిన మూడు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. ములగుడెం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. ట్రాన్సకో నిధులు రూ.14.50 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు.

ఎన్ఆర్ఈజిఎస్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన మూడు అభివృద్ది పనులు, సీడీపీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు.
పంగిడి గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు రూ.29 లక్షలతో చేపట్టిన ఏడు అభివృద్ది పనులకు, ఎస్డిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. ట్రాన్సకో నిధులు రూ.24 లక్షలతో చేపట్టిన మూడు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు.

కేవీ బంజర గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో రెండు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. ట్రాన్సకో నిధులు రూ.1350 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. సీడీపీ నిధులు రూ.11.75 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు.
దోనబండ గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన మూడు అభివృద్ది పనులు, సీడీపి నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు. ఎస్డిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నాలుగు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR ట్రాన్సకో నిధులు రూ.12.50 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు.

మంగ్య తండా గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు రూ.15లక్షలతో చేపట్టిన నాలుగు అభివృద్ది పనులు, ఎస్డిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రజబల్లి నగర్ గ్రామంలో NREGS నిధులు రూ.30 లక్షలతో చేపట్టిన ఐదు అభివృద్ది పనులు, సడిఎఫ్ నిధులు రూ.10 లక్షలతో రెండు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR ట్రాన్సకో నిధులు రూ.17 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్ల అభివృద్ది పనులు ప్రారంభించారు.

కార్యక్రమం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి విద్యా చందన, జడ్.పి.సి ఇ ఓ వి.వి.అప్పారావు, జడ్.పి.టీ.సి. ప్రియాంక, ఎం.పి.పి.గౌరీ, తహసీల్దార్ విల్సన్, ఎం.పి.డి.ఓ రామకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Related posts

హంస వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు

Satyam NEWS

చెక్కు బౌన్స్ కేసులో నిందితునికి శిక్ష ఖరారు

Murali Krishna

మానవత్వం చాటుకున్న ఎం.టి.ఓ. స్పర్జన్ రాజ్

Satyam NEWS

Leave a Comment