Slider నల్గొండ

మానవత్వం చాటుకున్న ఎం.టి.ఓ. స్పర్జన్ రాజ్

#NalgondaPolice

లాక్ డౌన్ నేపధ్యంలో నల్లగొండ జిల్లా పోలీసులు మానవతా హృదయంతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగుతున్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి.ఓ. స్పర్జన్ రాజ్ గత కొద్ది రోజులుగా ఏ.ఆర్. కానిస్టేబుల్స్ కిషన్ కుమార్, హఫీజ్, సైదులు ప్రారంభించిన సామాజిక సేవలకు తనవంతు చేయూత అందించి ఆదివారం అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి వారితో కలిసి పేదలకు అన్నదానం నిర్వహించారు.

కాగా వారి తోటి ఉద్యోగులు, అధికారులు సైతం స్పందించి వారి వెంట రావడంతో మరింత ఉత్సహంగా వలస కూలీలకు, అనాధాలకు, రోడ్ల వెంట ఉంటున్న అభాగ్యులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు అన్నదానంతో పాటు నిత్యావసరాలు అందిస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.

ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాలు, నార్కట్ పల్లి, చిట్యాల వరకు రోడ్ల వెంట వెళ్తున్న వలస కూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎం.టి.విభాగం సిబ్బంది లియాఖత్, ఆర్.ఎస్.ఐ. కళ్యాణ్ రాజ్, కానిస్టేబుల్స్ కిషన్ కుమార్, సైదులు, హాఫీజ్, ప్రదీప్, జయబాబు, కరుణాకర్, జగదీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం పదవి కాదు, ముందు డిపాజిట్ తెచ్చుకోండి

mamatha

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎడతెరిపిలేని దాడులు

Satyam NEWS

లెస్బియన్ జెండాతో కాళీ మాతను అవమానించేలా వాల్ పోస్టర్

Satyam NEWS

Leave a Comment