41.2 C
Hyderabad
May 4, 2024 18: 41 PM
Slider విజయనగరం

జగనన్న తోడు పథకం తో ఎంతమంది లబ్దిపొందుతున్నారో తెలుసా…?

#JaganannaToduScheme

ఏపీ రాష్ట్ర సీఎం జగన్   చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను కోర్టులలో కేసులు వేసి అడ్డుకుంటున్న చరిత్ర చంద్రబాబుదని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్,విజయనగర ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో” జగనన్న తోడు ” పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు  రెండు కోట్ల  94లక్షల  70 వేల రూపాయల మెగా చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీకి అప్పు తెచ్చుకొని వీధుల్లో వ్యాపారం చేసుకునే వారి  కష్టాన్ని తన పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి వడ్డీ లేకుండా పదివేల రూపాయలు రుణం ఇస్తానని ప్రకటించారన్నారు. అందుకు అనుగుణంగానే “జగనన్న తోడు” పథకానికి శ్రీకారం చుట్టారన్నారు.

గత ప్రభుత్వానికి భిన్నంగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్ ఫుట్ పాత్ చిల్లర వ్యాపారులకు కు చేదోడు వాదోడుగా నిలిచే ప్రయత్నం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. జగనన్న తోడు పథకాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చిల్లర వ్యాపారులకు చేదోడు

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసేందుకు జిల్లాకు సుమారు 28 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులు పెద్ద సాయంగా భావిస్తున్నారన్నారు. లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేసిన, చిరువ్యాపారులు దగ్గర అ పెట్టుబడులకు డబ్బు లేని పరిస్థితి నెలకొందని, ఇటువంటి పరిస్థితులలో “జగన్ అన్న తోడు” పథకం ద్వారా పది వేల రూపాయల చొప్పున అందివ్వడం గొప్ప విషయం అన్నారు.

ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే తత్వం తమదని,  కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉంటూ, సహాయ సహకారాలు అందిస్తూ వారికి భరోసా కల్పించిన ఘనత వైయస్సార్ పార్టీ శ్రేణులది అయితే, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి గేటుకు తాళం వేసుకున్న చరిత్ర తటీడీపీ వారిదేనని అన్నారు.

వారి అవసరాలకు రోడ్లపైకి వచ్చి లబ్ధి పొందుతూ, ప్రజల కష్ట సమయంలో గాలికొదిలేసిన నైజం టీడీపీ వారిదన్నారు. సీఎం జగన్  చేపడుతున్న జనరంజక పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు.

సంక్షేమ పథకాలను క్యాలెండర్ రూపంలో చేపడుతున్న ఏకైక సీఎం జగన్ అని అన్నారు. శాసనమండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ చేతివృత్తుల వారికి, చిరు వ్యాపారులకు జగన్ అన్న తోడు పథకం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న ఏకైక సీఎం జగన్ అని అన్నారు.

మేనిఫెస్టోను భగవద్గీత గా, బైబిల్ గా, ఖురాను గా భావిస్తూ సీఎం జగన్  ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ  జగనన్న తోడు పథకం లో మంజూరైన లబ్ధిదారులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు కృషి  చేయాలన్నారు. మెప్మా పీడీ కోట్ల సుగుణాకర్ రావు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు నవరత్నాల పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్న సీఎం జగన్ కు అందరూ ఆశీస్సులు అందించాలన్నారు.

సంక్షేమ పాలన రధసారధి వై ఎస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ సీఎం జగన్  మహిళా పక్షపాతి అని కొనియాడారు. అన్ని వయసుల వారికి ఏదో ఒక రూపంలో పథకాలను అందిస్తూ ప్రజా సంక్షేమ పాలన రథసారధిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన అందిస్తున్నారన్నారు.

కరోనా కష్టకాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉంటే, తెలుగుదేశం పార్టీ నేతలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు అన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ తిరుపతి నాయుడు, వైఎస్ఆర్ సీపీ నేతలులు , పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Related posts

మహాధర్నాకు వెళుతున్న ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

Satyam NEWS

స్కూలు విద్యార్ధుల కోసం టీవీ బహూకరణ

Satyam NEWS

జగన్ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో ప్ర‌తీ పేదవానికి ల‌బ్ది

Satyam NEWS

Leave a Comment