34.7 C
Hyderabad
May 5, 2024 01: 13 AM
Slider నల్గొండ

అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి

#CongressProtest

అర్హులైన నిరుపేద లందరికీ తెల్ల రేషన్ కార్డులు సుమారు 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయక పోవటంతో క్రొత్తగా వివిధ రూపాలలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం  తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టీ.పీ.సీ.సీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా మాట్లాడుతూ 

చాలామంది నూతనంగా వివాహమైనవారు, పిల్లలు కలిగిన వారి పేర్లను రేషన్ కార్డులో నమోదు చేసుకోవటం కొరకు, చాలా మంది పేద ప్రజలకు కొత్తగా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల అప్లికేషన్లను పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు విచారణ చేసి వాటిని  జిల్లా పౌరసరఫరాల శాఖ(D.S.O) అప్లోడ్ అయినాయని,ఈ దరఖాస్తులు పెట్టుకొని సుమారు రెండు సంవత్సరాలు దాటినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేసే కార్యక్రమం   నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్దిదారులు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే విచారణ చేసి క్రొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ  గత 2 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం ఎందుకు కలిగించటం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే క్రొత్త రేషన్ కార్డులు  మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ  వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయ అధికారిణి  సీనియర్ అసిస్టెంట్ సుశీలకి అందచేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, జక్కుల మల్లయ్య, మున్సిపాలిటీ కౌన్సిలర్లు ములకలపల్లి రామగోపి, తేజావత్ రాజా,సమ్మెట సుబ్బరాజు, ఎస్ కె.బిక్కన సాహెబ్,లచ్చిమల్ల నాగేశ్వర్రావు,కస్తాల ముత్తయ్య, గోపాలపురం సర్పంచ్ శాసనాల నాగసైదులు, మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు,దొంతగాని జగన్, మొదాల అంజయ్య,అనసూర్య, లలిత,మంగమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

IMF రుణం మంజూరు నిలిపివేత: పాకిస్తాన్ కు మరిన్న కష్టాలు

Satyam NEWS

గురజాల డివిజన్ లో పేదోడి సొంతింటి కల సాకారం

Satyam NEWS

సురభి కళాకారులను ఆదుకున్న సొసైటీ సర్వీస్

Satyam NEWS

Leave a Comment