30.3 C
Hyderabad
March 15, 2025 10: 57 AM
Slider నల్గొండ

సురభి కళాకారులను ఆదుకున్న సొసైటీ సర్వీస్

#Surabhi Artists

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న వారికి నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం, నార్కట్ పల్లి మండల కేంద్రంలో ఇండియన్ సొసైటీ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు  ప్రతిరోజు ఆహారం అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌటుప్పల్ నుంచి కట్టంగూర్ వరకు 60 కిలోమీటర్లు నేషనల్ హైవే 65 పై నాలుగు కార్లలో ప్రయాణిస్తూ ప్రతి రోజూ 250 మందికి భోజనాలు పెడుతున్నారు.

అదేవిధంగా ఈరోజు నార్కెట్ పల్లి మండలం లో ఉన్న 130 సంవత్సరాల చరిత్ర గల సురభి నాట్య మండలి వారి ఆకలి తీర్చారు.  ఊరూరా సంచారం చేస్తూ నాటకాలు ప్రదర్శిస్తూ ఉండే వీరు లాక్ డౌన్ సందర్భంగా ఉపాధికి దూరం అయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న సురభి నాట్య మండలి వారికి మేమున్నామంటూ ఇండియన్ సొసైటీ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు ఈరోజు 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

అదేవిధంగా ఎక్కడ నిరుపేదలు ఉన్న మాకు సమాచారం అందిన వెంటనే మేము వారిని ఆదుకుంటామని ఇండియన్ సొసైటీ సర్వీస్ ఆర్గనైజర్ కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ఆయన బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో నాయకులు సంగిశెట్టి ఉపేందర్, బూడిద గణపతి ప్రసాద్, పల్లె శివ ,శీల వేణు ,కోట వివేక్ అఖిల్, అనిల్ ,మిర్యాల సాయి, కుమారస్వామి గంజి జశ్వంత్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Satyam NEWS

ఘనంగా ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు

Satyam NEWS

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Sub Editor

Leave a Comment