27.7 C
Hyderabad
May 11, 2024 09: 38 AM
Slider ముఖ్యంశాలు

కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

#BRS

కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరనే దానిపై చర్చ జరుగుతుంది. వనమా ఎన్నికను కోర్టు రద్దు చేసి జలగం ను ఎమ్మెల్యేగా గుర్తిస్తున్నట్లు హై కోర్టు ప్రకటించ్చింది. దానిపై హైకోర్టు స్టే ఇచ్చింది. కొత్తగూడెంలో 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఈ ఎన్నికలో ఎన్నిక అఫిడవిట్లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని జలగం గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా వనమా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అనేక వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది జులై 25న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ప్రకటిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది.

అనంతరం రెండో స్థానంలో ఉన్న జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వనమా హైకోర్టులో స్టే కోరితే.. నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Related posts

ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల జయకేతనం

Satyam NEWS

శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Satyam NEWS

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment