24.7 C
Hyderabad
May 13, 2024 03: 56 AM
Slider ప్రపంచం

భారత్ లో చైనా రాయబారిని ఎందుకు మారుస్తున్నది….?

#china

భారత్‌కు కొత్త రాయబారిని నియమించాలని చైనా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారత్-చైనా సంబంధాలపై మరోసారి చర్చ ప్రారంభం అయింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు తెరపడుతుందా లేక గతం కంటే మరింత పెరుగుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇరుదేశాల సరిహద్దులో సైనిక ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో రాయబారి మార్పు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నది.

జి జిన్‌పింగ్ మూడవసారి అధ్యక్షుడు అయిన వెంటనే భారత రాయబారిని ఎందుకు మారుస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. చైనా రాయబారి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ప్రస్తుత అంబాసిడర్ సన్ వీడాంగ్ మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఇప్పుడు ఆయనను తొలగించి ఇక్కడ కొత్త రాయబారిని నియమించనున్నారు. అయితే సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని చైనాలో మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎన్నికైన తరుణంలో ఈ ప్రక్రియ జరగడం ఆసక్తి కలిగిస్తున్నది.

భారతదేశంలో చైనా రాయబారి సన్ వీడాంగ్ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వర్చువల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో భారత్, చైనా అధికారులు పాల్గొన్నారు. వీడాంగ్ ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ‘చైనాలో భారత రాయబారిగా పని చేయడం నా జీవితంలో మరిచిపోలేని సమయం. గత మూడేళ్ళ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాను. మీ మద్దతు మరియు సమిష్టి కృషితో, రెండు దేశాల మధ్య స్నేహం ఎప్పటికీ పచ్చగా ఉంటుంది అని పేర్కొన్నారు. చైనా రాయబారి సన్ వీడాంగ్ జూలై 2019లో భారతదేశంలో తన పనిని చేపట్టారు. ఈ 11 నెలల తర్వాత గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.

ఇందులో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, 45 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. అయితే, చైనా దానిని ఎప్పుడూ అంగీకరించలేదు. ఐదుగురు సైనికులను మాత్రమే చంపినట్లు చైనా అధికారికంగా అంగీకరించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాలు లక్షలాది మంది సైనిక సిబ్బందిని LACలో మోహరించాయి.

అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభమయ్యాయి. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద ఇరువైపులా సైనికులను తొలగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ చర్చల్లో సన్ వీడాంగ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. వాస్తవ నియంత్రణ రేఖపై ప్రస్తుత పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా కోరుకుంటోందని, అయితే చైనా ‘ప్రధాన ప్రయోజనాల’పై కూడా భారతదేశం శ్రద్ధ చూపాలని కోరారు.

అయితే జీ జిన్‌పింగ్ చూపు అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరించడంపైనే ఉంది. ఆయన మూడవసారి అధికారం చేపట్టారు. అంటే ఇప్పుడు ఆయన 2032 వరకు అధికారంలో ఉంటారు. మారిన జిన్‌పింగ్ ప్రకటనలు వింటుంటే, పొరుగు దేశాలపై చైనా వైఖరి మరింత కఠినంగా ఉండబోతున్నట్లు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాయబారి మార్పు పై ఆసక్తి కలుగుతున్నది.

Related posts

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

రక్తనిష్ట

Satyam NEWS

28 సినిమాకు రెడీ అవుతున్న మహేష్ బాబు

Satyam NEWS

Leave a Comment