29.7 C
Hyderabad
May 3, 2024 04: 15 AM
Slider సినిమా

28 సినిమాకు రెడీ అవుతున్న మహేష్ బాబు

mahesh babu

మహేశ్ బాబు తన 28వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే దిశగానే త్రివిక్రమ్ సంసిద్ధమవుతున్నాడు.

తాజాగా మహేశ్ బాబు మాట్లాడుతూ “నాకు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ .. డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక సినిమాను అన్ని వైపులా నుంచి తీర్చిదిద్దుకుంటూ రావడం ఆయన ప్రత్యేకత. పుష్కర కాలం తరువాత మళ్లీ కాంబినేషన్ సెట్ అయింది. ఆయనతో కలిసి మళ్లీ పని చేయడానికి నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా కొత్తదనం ఉన్న కథను ఎంచుకున్నాడు. డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా ముందుకు వెళుతుంది. ఇంతవరకూ తనుగానీ .. నేను గాని అలాంటి ఒక సినిమా చేయలేదు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని హామీ ఇస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Related posts

ప్రజల కొంపలు ముంచుతున్న కాలువల కబ్జా

Satyam NEWS

గౌలిపురాలో ఘనంగా ఆషాఢ బోనాలు

Satyam NEWS

గర్భస్రావం చేయించుకున్నందుకు ఆగ్రహం: భార్యను హత్య చేసిన భర్త

Satyam NEWS

Leave a Comment