30.7 C
Hyderabad
May 5, 2024 03: 37 AM
Slider సంపాదకీయం

జగన్ మనసులోని మాట బొత్సా నోటి వెంట….

#jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఆ రాష్ట్రం ఏం చేయాలి? ఏం చేయాలో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆర్ధిక ఇబ్బందులకు కారణం ఏమిటో చెప్పేయాలి. ఇంత కాలం చంద్రబాబు చేసిన అప్పుల వల్లే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులలో ఉందని చెప్పారు.

అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన అప్పులకు ఏడెనిమిది రెట్లు అప్పును జగన్ మోహన్ రెడ్డి చేశారు. దాంతో ఇప్పుడు సమస్యను మరో కొత్త విషయం వైపు మళ్లించాల్సి ఉంది. దీనికి భద్రాచలం వరద ముంపు అంశం కలిసి వచ్చింది. ఈ వివాదాన్ని తెలంగాణ కు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లేపడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు హైదరాబాద్ ఆదాయం విషయంలో వివాదం రేపుతున్నారు.

హైదరాబాద్ లో వచ్చే ఆదాయం లేకపోతే ఏపి బతికే అవకాశం లేదనే వాదనను బలంగా ముందుకు తీసుకువస్తున్నారు. జగన్ మంత్రి వర్గంలో నెంబర్ టు గా ఉన్న బొత్స సత్యనారాయణ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం గురించి మాట్లాడటమే కాకుండా ఏపి, తెలంగాణ మళ్లీ కలవాలనే వాదన కూడా ముందుకు తీసుకువస్తున్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం కారణంగానే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ మిగులు ఆదాయ రాష్ట్రంగా ఉండేది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఆది నుంచి లోటు ఆదాయంతోనే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారి ప్రతి రోజూ అప్పులు తెచ్చుకుంటే తప్ప రోజు గడవని స్థితికి వచ్చింది.

ఉచితంగా ఇచ్చే పథకాల వల్ల చాలా రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక స్థితికి తాము ఇచ్చే ఉచిత పథకాలే కారణమనే వాదన బయటకు రాకుండా ఉండేందుకు ‘‘హైదరాబాద్ ఆదాయం’’ అనే అంశాన్ని మంత్రి బొత్స తెరపైకి తెస్తున్నారు.

ముంపు గ్రామాల అంశాన్ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ లేవనెత్తడంతో ‘‘ఈ గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే  ఏపీని కూడా తెలంగాణ లో కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది హైదరాబాద్ లో కలిపేస్తారా? ఏపీ ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేదు తెలంగాణ లో కలిపేస్తారా? విలీన  గ్రామాలు  ప్రస్తావన  తెస్తే ఏపీ లో  హైదరాబాద్  కలపాలని  డిమాండ్  చేస్తాం’’ అని ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మంత్రి వర్గంలో నెంబర్ టు పొజిషన్ లో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారంటే ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ మాటలేనని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చ చూస్తుంటే మళ్లీ సమైక్య ఆంధ్ర కావాలనే దిశగా వైసీసీ కదులుతున్నాదా అనే అనుమానం వస్తున్నది.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కావాలనే నినాదం తీసుకుంటే ప్రస్తుత ఏపిలోని చాలా మంది మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ భావిస్తున్నది. ఇప్పటికీ చాలా మంది వైసీపీ నాయకులకు ఆస్తులన్నీ హైదరాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి. వైసీపీ నాయకులు చాలా మంది కరోనా వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ కు వచ్చే చికిత్స చేయించుకున్నారు.

ఇప్పటికీ చాలా మంది ఏపి మంత్రుల కుటుంబాలు హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం ఉంటున్నాయి. ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలూ హైదరాబాద్ తోనే ఉన్నందున చాలా మంది ప్రజలు కూడా సమైక్య ఆంధ్ర ప్రదేశ్ నినాదం తీసుకుంటే వైసీపీకి మద్దతు ఇచ్చారనే అభిప్రాయం వినిపిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ హైదరాబాద్ ఆదాయం, విభజిత ఏపిని మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్ చేయడం అనే అంశాలు ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నారు. ఇదే ఎన్నికల అంశంగా చేసుకుంటే మిగిలిన వైఫల్యాలు అన్నీ కూడా మరుగున పడిపోతాయని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.

Related posts

మిస్సింగ్ బాలికను తల్లిదండ్రుల వద్ద చేర్చిన మానవ హక్కుల కమిషన్

Satyam NEWS

ఈ పుట్టినరోజు ఒక మెమరబుల్ వీకే న‌రేష్‌

Sub Editor

కలుషిత నీటి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment