39.2 C
Hyderabad
May 3, 2024 11: 36 AM
Slider మహబూబ్ నగర్

వేలంపాటలో బినామీలని తేలితే చర్యలు..

#kollapurmunicipality

కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఇదివరకు షాపింగ్ కాంప్లెక్స్ టెండర్స్ వేశారు. వేలంపాట నిర్వహించారు. ఇందులో ఎవరికి తోచినంత వారు పాడుకున్నారు. 60, 70 వేల దాకా వేలంపాట పాడారు. ఎస్సీ రిజర్వేషన్ల కూడా ఇలాగే పాడారు. వీటిపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.

మొత్తానికి షాపింగ్ కాంప్లెక్స్ టెండర్స్ కోర్టు పరిధిలోకి వెళ్ళింది. గౌరవ న్యాయస్థాన సూచనలు మేరకు ప్రస్తుతం కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య ఓపెన్ టెండర్ ప్రకటన చేశారు. ఈరోజు అప్లికేషన్ లకు మంగళవారం సాయంత్రం వరకు అవకాశం ఇచ్చారు. 120 పైగానే అప్లికేషన్స్ వచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అందిన సమాచారం. ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది.

రేపు వేలంపాట నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ కొన్ని సూచనలు చేస్తునే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ లకు రిజర్వేషన్ వారిగా వేలంపాట జరగబోతుంది.వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కొందరు బినామీల పేర్లతో టెండర్స్ వేసి వేలం పాటలో పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతుండడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు.దీనితో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. బినామీలుగా పాల్గొన్నట్లుగా నిర్ధారణలు అయితే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

Related posts

విఫలమైన గడప గడపకూ వైస్సార్సీపీ కార్యక్రమం

Satyam NEWS

పెండింగ్‌ చలాన్ రాయితీలను వినియోగించుకోవాలి

Sub Editor 2

బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీతక్క

Satyam NEWS

Leave a Comment