27.7 C
Hyderabad
May 15, 2024 05: 32 AM
Slider సినిమా

వర్మకి పేటీఎమ్‌ ప్యాకేజ్‌ కట్‌ అవనుందా..?

#Ram Gopal Varma

రామ్‌ గోపాల్‌ వర్మ…. సంచలన దర్శకుడు స్థాయి నుండి ఓ యూ ట్యూబర్‌గా మారిపోయాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.. ఏపీలో అధికార జగన్‌ పార్టీకి ఓ పేటీఎమ్‌ కార్యకర్తగా సేవలు చేస్తున్నాడని, వైసీపీ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు.

ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరికదా, ఆ ముద్ర వేయించుకోవడానికి ఆయన తహతహలాడుతున్నారనే చర్చ ఉంది.. తాడేపల్లి ప్యాలెస్‌ నుండి అందుతోన్న ప్యాకేజ్‌ కోసమే… వర్మ ఇలాంటి రాగం అందుకున్నారనేది ఓపెన్‌ సీక్రెట్‌ అని చెబుతుంటారు రాజకీయ పరిశీలకులు.

తాజాగా తన యూ ట్యూబ్‌ చానెల్‌లో నిర్వహిస్తోన్న నిజం సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో వర్మ ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌తో నిర్వహించిన ఇంటర్‌ వ్యూలో లోకేష్‌, పవన్‌కి సంబంధించిన పలువులు వీడియోలు చూపించి ప్రోమో రిలీజ్‌ చేశాడు.. ఈ వీడియోస్‌లో లోకేష్‌, పవన్‌ ఆవేశపూరిత ప్రసంగాలను ఆయన ప్రదర్శించాడు.

అయితే, వీటికంటే అసహ్యకరమైన, అసభ్యకరమైన పదాలను ఈ నాలుగన్నరేళ్లలో ఉపయోగించారు వైసీపీ నేతలు.. ప్రతిపక్ష నేతలపై సభ్యసమాజం తలదించుకునే భాషను ప్రయోగించి రెచ్చిపోయారు.. అధికారం తమ చేతుల్లో ఉందనే అండతోపాటు తాడేపల్లి ప్యాలెస్‌ నుండి ఎప్పటికి అప్పుడు అందుతోన్న స్క్రిప్ట్‌ని యాజిటీజ్‌గా వాడి ప్రత్యర్ధులను మానసికంగా దెబ్బకొట్టాలని చూశారు..

ఈ లిస్టులో మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలే ఉండడం విశేషం. ఇలాంటి వారికి బూతు మంత్రులు అని సోషల్‌ మీడియాలో మీమ్స్‌, సెటైర్లు పడుతున్నా, నాలుగేళ్లుగా నిద్రపోయిన రామ్‌ గోపాల్‌ వర్మకి తాజాగా లోకేష్‌, పవన్‌ డైలాగులు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ వీడియోలు చేయడం ఏ పేటీఎమ్‌ పెద్దలని మెప్పించడానికి అనే ప్రశ్నలు వస్తున్నాయి. వర్మ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ఈ వీడియోల వెనక అసలు టార్గెట్‌ ఏంటనేది ఓపెన్‌ సీక్రెట్‌.

ఇప్పటికే జగన్‌కి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వారిపై విషం చిమ్ముతూ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు రామ్‌ గోపాల్‌ వర్మ.. తీవ్ర అప్పుల కుప్పలో కూరుకుపోయి, నెలసరి ఖర్చులకు సైతం పైసా పుట్టలేని సమయంలో వర్మకు ఏపీ ఎన్నికలు వరంలా కలిసి వచ్చాయని చెబుతారు ఆయన సన్నిహితులు. తాడేపల్లి ప్యాలెస్‌ నుండి అందిని ప్యాకేజ్‌తో వర్మ భారీ డెన్‌ ఏర్పాటు చేసుకున్నాడు..

వాటితో పలు చిన్న చిన్న సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. వీటికి నిధులు అంతా పేటీఎమ్‌ పెద్దలు చూసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. అందుకే, తనకు అందుతోన్న ప్యాకేజ్‌కి న్యాయం చేసే పనిలో భాగంగా రామ్‌ గోపాల్‌ వర్మ ఈ వీడియోస్‌ చేస్తున్నాడు. ఇది తెలిసిన వ్యూయర్స్‌.. వర్మ వీడియోస్‌ని లైట్‌ తీసుకుంటున్నారు..

ప్యాకేజ్‌కి న్యాయం జరుగుతుందా.? లేదా.?? అనే అంశంపై తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు డైలమాలో పడిపోయారట.. ఇదే నిజం అయితే, వర్మ అకౌంట్స్‌కి నిధులు ఆగిపోవడం ఖాయమా.? ఆయన డెన్‌ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన వర్మ.. మరింతగా పైసా వసూల్‌కి రెడీ అవుతున్నాడట.. మరి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related posts

డిటెక్టీవ్ లుక్ లో అదరగొట్టిన హీరోయిన్ అంజలి

Satyam NEWS

ప్రచారం ముగిసినా రోడ్లపైనే ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే

Satyam NEWS

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment