40.2 C
Hyderabad
May 5, 2024 16: 57 PM
Slider ప్రపంచం

Operation Ganga: ప్రధాని మోదీ చొరవతో విద్యార్ధుల ప్రాణాలు సురక్షితం

#operationganga

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయిన రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల గురించి ఎంత తల్లడిల్లిపోయారో వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్. ఉక్రెయిన్, రష్యా దేశాలలో మన దేశం నుంచి వెళ్లిన ఎంతో మంది విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసిస్తుంటారు. రెండు దేశాలలో యద్ధం జరుగుతున్నది. ఏం చేయాలి?

ఇదే ప్రశ్నతో ప్రధాని నరేంద్రమోదీ ఎంతో తల్లడిల్లిపోయారు. దాంతో ఆయన ఆపరేషన్ గంగ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ మాట్లాడుతూ ఆ విషయాలను గుర్తు చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలోని భారతీయ విద్యార్థులను సురక్షితంగా తిరిగి వారి భూమికి తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎలా విజయం సాధించారో చెప్పారు.

విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు, అక్కడ భారీగా ప్రాణ నష్టం సంభవించింది. అక్కడ చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు దేశంలో తీవ్ర ఆందోళన చెందారు.  అటువంటి పరిస్థితిలో, భారతదేశం ఆపరేషన్ గంగా అమలు చేయడం ద్వారా ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయులను రక్షించింది.

వారిలో ఎక్కువ మంది కళాశాల విద్యార్థులు, ఉక్రెయిన్‌లోని వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. మోడీ @ 20 వేడుకలో, విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, “ఉక్రెయిన్‌లోని సుమీ మరియు ఖార్కివ్‌లలో దాడులు తీవ్రతరం అయినప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. మా పిల్లలు అక్కడ చిక్కుకున్నారని వారిద్దరికి వివరించి చెప్పారు అని జై శంకర్ తెలిపారు.

ఎలాగైనా వారిని సురక్షితంగా తమ దేశానికి తరలించేందుకు సహకరించాలని ఇద్దరిని ప్రధాని కోరారు. ప్రధాని మోదీ చేసిన వినతికి ఇరు దేశాధినేతలు ఎంతో పాజిటీవ్ గా స్పందించారు. విద్యార్థులను సురక్షితంగా తరలించే వరకు ఒక్క కాల్పుల ఘటన కూడా జరగదని హామీ ఇచ్చారని జైశంకర్ గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఆ నాడు ఆ చొరవ తీసుకోకపోయినట్లయితే భారతీయ విద్యార్ధులకు ఎంతో కష్టం కలిగి ఉండదేని ఆయన తెలిపారు. ఆపరేషన్ గంగ కోసం ప్రధాని ఎంతో తపించారని, చివరకు అందరు విద్యార్ధుల్ని భారత ప్రభుత్వం సురక్షితంగా తరలించగలిగిందని ఆయన తెలిపారు.

Related posts

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

కాంగ్రెస్ లోకి జూపల్లి: బోగస్ ప్రచారంపై మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

కరోనాతో ములుగులో హిందీ ఉపాధ్యాయుడు మృతి

Satyam NEWS

Leave a Comment