37.2 C
Hyderabad
May 6, 2024 19: 04 PM
Slider ముఖ్యంశాలు

టీడీపీ బస్ యాత్ర కు ఎండను సహితం లెక్క చేయకుండా…!

#TDP bus

భానుడి భగభగలకు…ప్రతీ ప్రాణి అల్లాడిపోవాల్సిందే.జులై మాసం అంటే వర్షాకాలం అనుకోవడం తప్ప…ప్రస్తుత ఈనెలలో 3వ తేదీ తప్ప మిగిలిన అన్ని రోజులు తనప్రతాపాన్ని సూరిబాబు చూపిస్తున్నాడు.తాజాగా ఆ మండుటెండలో.. టీడీపీ యాత్ర చేపట్టింది. టీడీపీ సీనియర్ నేతలు.. మాజీ మంత్రులు..

పార్టీ నేతలు భారీ ఎత్తున పాల్గొంటున్నారన్న సమాచారం తో జిల్లా పోలీసు శాఖ…బాధ్యతాయుతంగా బందోబస్తు నిర్వహించింది.ఎస్పీ దీపికా ఆదేశాలు.. విజయనగర డీఎస్పీ గోవిందరావు సూచనలతో వన్ టౌన్, టూటౌన్, రూరల్, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడిక్కడే…బస్ యాత్ర కు అడ్డంకి లేకుండా… ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

ప్రధానంగా ఈ బస్ యాత్ర విజయనగరం ప్రధాన రోడ్ మార్గం గుండా వెళ్లడంతో ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాధ్ ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్ఐ రాజు..అడుగడుగునా అటు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఇటు బస్ యాత్ర కు ఇబ్బందులు తలెత్తకుండాతన ట్రాఫిక్ సిబ్బంది తో ఎక్కడ నీడ ను పట్టకుండా… అశోక్ బంగ్లా, కలెక్టరేట్, నీళ్ల ట్యాంక్, అంబటి సత్రం..మూడు లాంతర్లు, గురజాడ గృహం ,బాలాజీ జంక్షన్ వద్థ…

ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు… టీడీపీ చేపట్టిన యాత్ర అనుకున్న షెడ్యూల్ ప్రకారం తొలి పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ట్రాఫిక్ విభాగం తో పాటు కొండవెలగాడ ,నెల్లిమర్ల వద్ద..టౌన్ టౌన్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ లు షేక్ శంకర్, బాలాజీ ,అలాగే ఏఆర్ సిబ్బంది విధులు సమర్ధవంతంగా నిర్వహించడంతో ఒక్క పూట బస్ యాత్ర ప్రశాంతంగా పూర్తయింది.

Related posts

ఇసుక అక్రమ రవాణా అంశం లో అధికారుల సస్పెన్షన్

Satyam NEWS

గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలల్లో కీచక టీచర్లు

Satyam NEWS

వాతావరణంలో పెను మార్పులకు అసలు కారణం ఇది

Satyam NEWS

Leave a Comment