29.7 C
Hyderabad
April 29, 2024 08: 11 AM
Slider ముఖ్యంశాలు

సోము వీర్రాజు తొలగింపు: పురందేశ్వరికి పట్టం

#purandeswari

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించడం కలకలం సృష్టించింది. సోమును హఠాత్తుగా తొలగించడంతో తెలంగాణాలో కూడా మార్పులు వుంటాయని భావిస్తున్నారు. కాగా నూతన అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పి షాక్ ఇచ్చారు.

కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు. ‘ మీ టర్మ్‌ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి’ అని సూచించారు. బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమాన్ని సోము వీర్రాజు నిర్వహించిన కాసేపటికే ఈ షాకింగ్ న్యూస్ ఆయన వినాల్సి వచ్చింది. ఏపీలో ఇటీవలి కాలంలో ఆయనపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అంతే గాకుండా కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కూడా కారణం సోమూ వీర్రాజేనన్న చర్చ నడిచింది.

ఈ క్రమంలోనే అధ్యక్షుడి మార్పు ఆవశ్యకమని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోము వీర్రాజు ఎపీ అధ్యక్ష పదవి నుంచి బీజేపీ తొలగించడం.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకానున్నాయి. అదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా చేశారు.

Related posts

టిడిపి కార్యాలయాలపై దాడులను ఖండించిన రఘురామ

Satyam NEWS

పెట్రోల్ బంకు వద్దు: కళ్యాణ మండపాన్ని నిర్మించండి

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు

Satyam NEWS

Leave a Comment