32.2 C
Hyderabad
May 12, 2024 21: 15 PM
Slider మహబూబ్ నగర్

క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా టీచర్ కు సన్మానం

womens day

క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలకు చెందిన 54 మంది మహిళా టీచర్లకు సన్మానం చేశారు. MEO డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి అధ్యక్షతన  ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా MPP సుధారాణి, ZPTC భాగ్యమ్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే గమనం లేదు, స్తీ లేకుంటే అసలు సృష్టే లేదని అన్నారు. ఆనాది కాలం నుండి దేవతల నిలయంగా ఉన్న ఈ భారతదేశం లో స్తీ గా జన్మించటం అదృష్టం అన్నారు.

ప్రస్తుత కాలం లోని మహిళలు,వారి సమస్యల గురించి ప్రస్తావించారు. పురుషులకు మించి బాధ్యతలు మోస్తున్న నేటి మహిళలు హక్కులు అనుభవించడం లో మాత్రం వెనకబాటుకు గురౌతున్నారన్నారు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని ప్రతీ వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కుటుంబాన్నే కాదు రాష్ట్రాన్ని, దేశాన్ని సైతం ప్రతిభావంతంగా ముందుకు నడిపించగల సమర్ధత ఆడవారిలో ఉందన్నారు. పేపర్ కే పరిమితమైన రిజర్వేషన్ లు అమలు కు నోచుకోవాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. చట్టసభల్లో 50 % రిజర్వేషన్ మహిళలకు కల్పించాలని కోరారు.

MEO డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యుడుగా ఉన్న  అన్ని మండలాల్లో  మహిళా టీచర్లే బాధ్యతగా పని చేస్తున్నారని అన్నారు. అనంతరం మహిళా టీచర్లకు MEO, ఎంపీపీ, జడ్పీటీసీ, కాంప్లెక్స్ HM మునావర్ సుల్తానా,  క్లాస్ మేట్ క్లబ్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన శాలువాలు, జ్ఞాపిక ల తో ఘనంగా సన్మానించారు. టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న 150 మంది విద్యార్థులకు ప్యాడ్, పెన్నులు ఉచితంగా అందించిన అర్థం రవిని అభినందించారు. మహిళల పట్ల అభిమానాన్ని చాటుతూ జ్ఞాపికలు, శాలువా లకు ఆర్థిక చేయూతనిచ్చిన నాగారం వెంకటేశ్వర రావును సన్మానించారు.

Related posts

ఈ నెల 19 తర్వాత సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు

Satyam NEWS

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

Satyam NEWS

మల్దకల్ లో అన్నదాత ఆత్మీయ సంబరాలు ప్రారంభం

Bhavani

Leave a Comment