37.2 C
Hyderabad
May 6, 2024 21: 29 PM
Slider ప్రపంచం

ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్.. WHO ఆమోదం

ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. ప్రతి రెండు నిమిషాలకు ఒక పిల్లవాడు మలేరియాతో మరణిస్తున్నట్లు WHO ట్వీట్ చేసింది.

అధిక మలేరియా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పిల్లల మరణాలను తగ్గించడానికి WTS RTS, S మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేస్తోంది.

2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 25 దేశాలలో నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించారు. మలేరియా వ్యాక్సిన్‌ను ఆఫ్రికాలో ఉన్న పిల్లల్లో ఉపయోగించాలని నిర్ణయించింది.

మలేరియా వ్యాప్తి ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా ఉంది. మలేరియాతో ప్రతి ఏటా దాదాపు 260,000 ఆఫ్రికన్ చిన్నారులు మరణిస్తున్నారు.

Related posts

కమ్యూనిస్టుల దారెటు ..?

Satyam NEWS

ఇంటి మార్గం మూత వృద్దాప్యంలో మాజీ పోలీస్ ఇబ్బందులు

Sub Editor

బ్రహ్మాండమైన కథ-కథనాలతో ఓ రేంజ్ ప్రొడక్షన్స్ “బ్రహ్మ రాసిన కథ”

Satyam NEWS

Leave a Comment