33.2 C
Hyderabad
May 15, 2024 15: 09 PM
Slider ప్రపంచం

స్పేస్ స్టేషన్ లో రష్యా మూవీ చిత్రీకరణ తొలి చిత్రంగా గణతి

రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం పెద్ద సాహసమే చేసింది. నేరుగా అంతరిక్షంలో షూటింగ్​ చేయాలని నిర్ణయించింది. షూటింగ్​ కోసం ఆ సినిమా డైరెక్టర్​, హీరోయిన్​ ప్రత్యేక వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​)కు వెళ్లారు.

‘ది ఛాలెంజ్​’ అనే సినిమా షూటింగ్​లో భాగంగా రష్యాకు చెందిన 37 ఏళ్ల నటి యులియా పెరెసిల్డ్​, డైరెక్టర్​ క్లిమ్​ షిపెంకో నింగిలోకి వెళ్లారు. కాస్మోనాట్​ ఆంటోన్​ ష్కాప్లెరోవ్​ రష్యన్​ సూయెజ్​ స్పేస్​ క్రాఫ్ట్​లో ప్రయాణించారు.

డైరెక్టర్​, హీరోయిన్​ 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్​ ఐఎస్​ఎస్​కు వెళ్లే సన్నివేశానికి సంబంధించిన షూట్​ అక్కడ జరపనున్నారు.

ఇది విజయవంతమైతే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా రికార్డుకెక్కనుంది. నిజంగా ఇలా నటీనటులు అంతరిక్షంలోకి వెళ్లి సినిమా తీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

​, హీరోయిన్​ ప్రత్యేక వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​)కు వెళ్లారు.

‘ది ఛాలెంజ్​’ అనే సినిమా షూటింగ్​లో భాగంగా రష్యాకు చెందిన 37 ఏళ్ల నటి యులియా పెరెసిల్డ్​, డైరెక్టర్​ క్లిమ్​ షిపెంకో నింగిలోకి వెళ్లారు. కాస్మోనాట్​ ఆంటోన్​ ష్కాప్లెరోవ్​ రష్యన్​ సూయెజ్​ స్పేస్​ క్రాఫ్ట్​లో ప్రయాణించారు.

డైరెక్టర్​, హీరోయిన్​ 12 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్​ ఐఎస్​ఎస్​కు వెళ్లే సన్నివేశానికి సంబంధించిన షూట్​ అక్కడ జరపనున్నారు.

ఇది విజయవంతమైతే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా రికార్డుకెక్కనుంది. నిజంగా ఇలా నటీనటులు అంతరిక్షంలోకి వెళ్లి సినిమా తీయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Related posts

ఆహ్వానం …

Satyam NEWS

డ్రంక్ అండ్ డ్రైవ్: రెండు బైకులు ఢీ ముగ్గురికి గాయాలు

Satyam NEWS

అందరినీ కలుపుకుపోతా: బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్ధి బండారి

Satyam NEWS

Leave a Comment