36.2 C
Hyderabad
May 7, 2024 13: 37 PM
Slider విజయనగరం

ఆక్వా బజార్ మార్కెటింగ్  సొసైటీ..!

masthyakara

మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర సీఎం జగన్… సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్రంలోని అన్నిజిల్లా కలెక్టర్లతో పాటు, విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, ఎమ్మెల్యేలు పాల్లొన్నారు. మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకునేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసిన  మార్కెటింగ్ సొసైటీ పత్రాలను మత్స్యకార సంఘాలకు జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ అందజేసారు. 
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ నాలుగు ఫిషింగ్ హార్బర్ లకు, 25 ఆక్వాహబ్ లకు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా శంకుస్థాపనలు చేసారు. 

ఈ కార్యక్రమంలో విజయనగరం నుండి జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, ఎమ్మెల్సీపెనుమత్స సురేష్ బాబు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, సంయక్త కలెక్టర్లు జే.సీ కిషోర్ కుమార్, జే. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ర్టంలోనే తొలి మ‌త్స‌కార మార్కెటింగ్ సోసైటీ

ముఖ్యమంత్రి  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆక్వా బజార్ కు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్ సొసైటీ  రిజిస్ట్రేషన్ పత్రం తో పాటు బైలాను సంఘ సభ్యులకు అందజేసారు. ప్రతి జిల్లాకు ఒక ఆక్వా మార్కెటింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున, రాష్ట్రం లోనే విజయనగరం తొలి సొసైటీగా ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు..  

62 మంది మ‌త్స‌కార కిసాన్ క్రెడిట్ కార్డుల అంద‌జేత‌

అనంతరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో గల స్వదేశి మత్స్యకారులకు, ఆక్వా రైతులకు, చేపల వ్యాపారం చేసుకునే వారికీ, మహిళా సహకార సంఘాల సభ్యులకు పెట్టుబడి కోసం బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీ తో రుణం  అంద‌చేస్తామ‌న్నారు. ఈ సందర్భంగా 62 మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేసారు. 

వీరికి బ్యాంకుల ద్వారా మంజూరు జేసిన  13.5 లక్షల రూపాయల రుణానికి సంబంధించిన పాస్ పుస్తకాలను అందజేసారు. జిల్లాలో ఇప్పటి వరకు 128 మందికి 19.95 లక్షల రూపాయలను కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల క్రింద మంజూరు చేశామ‌న్నారు.

ఇటీవల ప్రభుత్వం నియమించిన మత్స్యకార కార్పొరేషన్  డైరెక్టర్ మైలపల్లి నరసింహులును ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ తో పాటు శాసన మండలి సభ్యులు,శాసన సభ్యులు, మత్స్య శాఖ ఉప సంచాలకులు నిర్మలా కుమారి,  జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షులు బర్రి చిన్నఅప్పన్న, మక్కువ ఆక్వా రైతుల మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు వై. గోపాల కృష్ణ, మహిళా సంఘాల ప్రతినిధులు పుష్ప గుచ్చాలతో, శాలువాలతో  సన్మానించారు. మత్స్యకారులకు మేలు జరిగేలా కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాడు డైరెక్టర్ ను కోరారు.

Related posts

స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్త్

Satyam NEWS

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ, ఎస్ ఐ

Satyam NEWS

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుల్ కు జరిమానా

Satyam NEWS

Leave a Comment