39.2 C
Hyderabad
May 3, 2024 14: 34 PM
Slider హైదరాబాద్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ, ఎస్ ఐ

#ACB Raid

15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ ప్రాంతంలోని షేక్ పెట్ ఆర్ ఐ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ ఐ నాగార్జున రెడ్డి ఒక స్థల యజమాని నుంచి యాభై లక్షలు డిమాండ్ చేశాడు.

తన భూమి హద్దులు చూపించాలని ఒక వ్యక్తి షేక్ పేట్ మండల ఆఫీస్ లో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ స్థలం విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. బాధితుడు ల్యాండ్ పైకి వెళ్లడంతో షేక్ పెట్ తాసిల్దార్ ఏప్రిల్ నెలలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాసిల్దార్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ పేట్ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి బాధితుని వద్దకు వెళ్లి నీకు ఫేవర్ గా చేయడానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని  డిమాండ్ చేశాడు.

ఈరోజు అతని వద్ద నుంచి 15 లక్షలు రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే కేసు విషయంలో బంజారాహిల్స్ లో పనిచేస్తున్న ఎస్ ఐ రవీందర్ నాయక్ బాధితుని నుంచి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షా 50 వేల రూపాయలను తీసుకున్నాడు.

కేసు నుండి పూర్తిగా తప్పించాలి అంటే మరో మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని బాధితుని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై రవీందర్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించిన శాసన సభాపతి

Satyam NEWS

చదువుతోనే భవిష్యత్

Bhavani

పంచ‌భూతాల వ‌ల్ల‌నే మాన‌వ మ‌నుగ‌డ‌

Satyam NEWS

Leave a Comment