36.2 C
Hyderabad
May 12, 2024 16: 36 PM
Slider మహబూబ్ నగర్

ఈ నెల 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే

#Kollapur Medical department

ప్రతి ఏటా జూలై 6వ తేదీన ప్రపంచ  జూనోసిస్ డేగా జరుపుకుంటాము. జంతువుల నుండి మనుషులకు గాని మనుషుల నుండి జంతువులకి గాని వ్యాప్తిచెందే వివిధ రకాల రోగాలను జూనోటిక్ డిసీసెస్ అని అంటారు. ఇందులో మనకి బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ పారాసైటిక్ ఇతరత్రా రోగాలు ఉంటాయి.

ఈ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేదే ఈ జూనోసిస్ డే. 1885 జూలై 6వ తేదీ నాడు లూయిస్ పాస్టర్ మొట్టమొదటిసారిగా ఆంటీ రేబీస్ వైరస్ వ్యాక్సిన్ వేశారు. దానికి గుర్తుగా జులై 6వ తేదీన జూనోసిస్ డే గా జరుపుకుంటాము.

ముఖ్యంగా మనకి ఈ వ్యాధులలో పిచ్చికుక్క  కాటువ్యాధి ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనిని నివారించడానికి ఏటా మన పెంపుడు జంతువులకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్  వేయించుకోవటం వలన మనకి మన పెంపుడు జంతువు కి ఇద్దరికీ మేలు చేస్తుంది.

ఈసారి ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా కొల్లాపూర్ మండలం లోని ప్రాంతీయ పశు వైద్యశాలలో బ్రిలియంట్ ఫార్మా ఖైరతాబాద్  వారి సహకారంతో నాగర్ కర్నూల జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అంజిలప్ప, కొల్లాపూర్  అసిస్టెంట్ డైరెక్టర్  డాక్టర్ ఆదిత్య వర్మ ఆధ్వర్యంలోఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేస్తారు.

మండలం పరిధిలోని పెంపుడు కుక్కలు కలవారు  పశువుల దావఖాన కు వచ్చిఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

డాక్టర్ వరలక్ష్మి, కొల్లాపూర్ మండల పశువైద్యాధికారి

Related posts

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అర్నబ్ గోస్వామి

Satyam NEWS

కమిట్ మెంట్: ఇక పట్టణాల రూపురేఖలు మార్చేస్తాం

Satyam NEWS

దిశా స్ఫూర్తితో కేసుల దర్యాప్తు వేగవంతం: ఎస్పీ దీపికాపాటిల్

Satyam NEWS

Leave a Comment