40.2 C
Hyderabad
May 5, 2024 16: 24 PM
Slider ముఖ్యంశాలు

కెసిఆర్ మనవనికి రేషన్ బియ్యం పెడతారా..?

#sharmila

నా మనవడు ఏ బియ్యం తింటాడో పేదవాడి పిల్లలు కూడా అవే బియ్యం తినాలని నాడు కేసీఆర్ చెప్పారని, నేడు పేదవాడి పిల్లలు తినే దొడ్ఫుబియ్యం కేసీఆర్ మనవడు తింటాడా అని వైఎస్ఆర్టిపి అధినేత వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజాప్రస్తానం పాదయాత్రలో భాగంగా లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామంలో ప్రజలతో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. పేదలకు దొడ్డు బియ్యం ఇస్తూ కేసీఅర్ మాత్రం ఫామ్ హౌజ్ లో భోగాలు అనుభవిస్తున్నాడన్నారు.  వైఎస్సార్ ఉన్నప్పుడు బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు ఇచ్చేవారని, ఇప్పుడు అన్ని బంద్ పెట్టీ దొడ్డు బియ్యం ఇచ్చి గొప్పలు చెప్తున్నాడన్నారు. ప్రజల కోసమే పని చేసే నాయకుడు వైఎస్సార్ అని, ఇప్పుడు 8 ఏళ్లుగా కేసీఅర్ చేస్తున్నది మోసమే కదా అని ప్రజలను ప్రశ్నించారు.

ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశాడు.. రుణమాఫీ, మూడు ఎకరాల భూమి అని మోసం చేసాడన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం అని రెచ్చగొట్టారని, అందుకే నిరుద్యోగులు పోరాటం చేశారని తెలిపారు. వందల మంది విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేశారని, ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఉద్యోగాలు కావాలి అని అడిగితే హమాలి పని చేసుకోండని హేళన చేస్తున్నారని విమర్శించారు.

విద్యా వ్యవస్థను పూర్తిగా కేసీఅర్ బ్రష్టు పట్టించారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిధులు విడుదల చేయక పోవడంతో యువతకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ లో ఏ నాయకుడు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని చూడటం లేదన్నారు. పార్టీ నేతల కోసమే పథకాలు ప్రవేశపెడుతున్నారని, పథకాలు అన్ని ఉన్నోల్లకే వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. దళిత బందు సామాన్యులకు ఇచ్చారా..?మొత్తం పార్టీ నేతలకు ఇచ్చుకున్నారు కదా అని ప్రశ్నించారు.

కేసీఅర్ కు ప్రజలు అంటే కేవలం ఓట్లేసే మిషన్లు మాత్రమేనని, ఎన్నికలు ఉంటేనే ఆయన బయటకు వస్తాడని, మంచి మంచి గారడీ మాటలు చెప్తాడని, ఓట్లు వేయించుకొని ఫామ్ హౌజ్ కి వెళ్ళిపోతాడని దుయ్యబట్టారు. ఈ సారి కేసీఅర్ కు అదే ఓట్లతో బుద్ది చెప్పాలన్నారు. మళ్ళీ కేసీఅర్ కి ఒట్లేస్తే మీ బిడ్డలు మిమ్మల్ని క్షమించరని చెప్పారు. కేసీఅర్ తెలంగాణ సొమ్ము ను భయంకరంగా తిన్నారని, అందుకే ఎన్నికలలో బాగా డబ్బులు ఇస్తారని, ఎన్ని డబ్బులు ఇచ్చినా మొత్తం తీసుకోవాలని, అవన్నీ మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బులేనని ప్రజలకు సూచించారు. ప్రజల కోసం కొట్లాడే పార్టీని  ఆశీర్వదించాలని కోరారు.

తెలంగాణలో ప్రజల పక్షాన కొట్లాడే పార్టీనే లేదని, 8 ఏళ్లుగా బీజేపీ,కాంగ్రెస్ లు సైతం ప్రజలను మోసం చేశాయని, ప్రజల పక్షాన ఏనాడు ప్రతిపక్షం నిలబడలేదని తెలిపారు. కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని, ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టానని, వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు రావడం కోసమే వైఎస్ఆర్టిపి అని తెలిపారు. వైఎస్సార్ హయాంలో రైతు రాజులా బ్రతికాడన్నారు. వైఎస్ఆర్ హయాంలో 40 లక్షల పేదల కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారని, ఓకేసారి రుణమాఫీ చేసి రైతులకు వైఎస్సార్ దేవుడయ్యాడన్నారు. అలాంటి వైఎస్ఆర్ పాలన కేవలం వైఎస్ఆర్టిపితోనే సాధ్యన్నారు.

వైఎస్సార్ పథకాలను మళ్ళీ నిలబడతానని, ప్రతి పథకం బ్రహ్మాండంగా అమలు చేసి చూపిస్తానని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని, ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తానని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అరోగ్య పథకానికి పునర్ వైభవం తీసుకు వస్తానని, రైతు కోసం, రైతు కూలీల కోసం, కౌలు రైతుల కోసం నిలబడతానని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టానని, ప్రజల కోసమే నిలబడతానని పేర్కొన్నారు.

Related posts

వైయస్సార్ సేవలు స్ఫూర్తిదాయకం

Bhavani

వనపర్తిలో వైన్ షాపు తరలింపునకు అధికారుల హామీ

Satyam NEWS

ఉత్తమ్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు

Satyam NEWS

Leave a Comment