28.7 C
Hyderabad
May 5, 2024 08: 33 AM
Slider ఆధ్యాత్మికం

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

#yadadri

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో నిర్వహించే కార్యక్రమాలు

21-02-2023 : ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం.

22-02-2023 : ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ. 11 గంటలకు ధ్వజారోహణం. సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవత ఆహ్వానంహవనం.

23-02-2023 : ఉదయం 8 గంటలకు అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణం. రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ.

24-02-2023 : ఉదయం 9 గంటలకు వటపత్రసాయి అలంకార సేవ. రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ.

25-02-2023 : ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7 గంటలకు పొన్న వాహనసేవ.

26-02-2023 : ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ. రాత్రి 7 గంటలకు సింహవాహన అలంకార సేవ.

27-02-2023 : ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం.

28-02-2023 : ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామిఅమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.

01-03-2023 : ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.

02-03-2023 : ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన.

03-03-2023 : ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం. రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తం.

Related posts

రాజీవ్ గాంధీ హత్య కేసు: వేలూరు జైలు నుంచి విడుదలైన నళిని

Bhavani

బూడిదైన పత్తి: ఓ రైతు కుటుంబానికి తీరని నష్టం

Satyam NEWS

బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో ఓయ విద్యార్థి నేత

Satyam NEWS

Leave a Comment