41.2 C
Hyderabad
May 4, 2024 15: 49 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ పై యూట్యూబ్ సాంగ్ ని ప్రారంభించిన కౌన్సిలర్లు

#hujuranagarvideo

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని13వ,వార్డులో నిర్మాత సైదులు,డాన్స్ మాస్టర్ నంజీ మదర్ థెరిసా అమ్మ డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ రవి నాయక్ అధ్యక్షతన 13వ,వార్డు బాలబాలికలతో రూపొందించిన  యూట్యూబ్ సాంగ్ ని ముఖ్య అతిథులుగా హాజరైన మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,13వ,వార్డు కౌన్సిలర్ రాజా నాయక్,23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నాగరాజు ల చేతుల మీదుగా యూట్యూబ్ ఛానల్ లో పాటలని అప్లోడ్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ సాంప్రదాయాలకి అద్దం పట్టేలా భక్తి భావాలతో హుజూర్ నగర్ నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రకృతి అందాలని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ 13వ,వార్డు బాలబాలికలతో,ప్రజలతో కలిసి చక్కటి పాటని చిత్రీకరించేందుకు ఎంతో శ్రమ పడినటువంటి నిర్మాత సైదులు,డాన్స్ మాస్టర్ నంజీ ని అభినందించారు.

హుజూర్ నగర్ కి చెందిన ప్రజలందరూ ‘అమ్మా డాన్స్ అకాడమీ’యూట్యూబ్ ఛానల్ ని వీక్షించి,ఆదరించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో న్యాయవాది చకిలం వెంకటేశ్వర్లు,13వ,వార్డు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మత్స్యకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 24న సభ

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్: మొక్క నాటండి అభిమానం చాటండి

Satyam NEWS

కేంద్ర మాజీమంత్రి,రెబెల్ స్టార్ కృష్ణంరాజు మృతి

Satyam NEWS

Leave a Comment