29.7 C
Hyderabad
May 4, 2024 06: 32 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు రూ.1.84 కోట్లు విడుదల

#election ceo

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఖర్చుల కోసం రూ.1,84,44,715లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తాన్ని జిల్లాకు ఇచ్చేవారు. ఈసారి అలా కాకుండా ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాలకు వేరువేరుగా కేటాయింపులు చేశారు. విశాఖ జిల్లాకు అత్యధికంగా రూ.80,67,079 కేటాయించారు. శ్రీకాకుళానికి రూ.27,95,804. విజయనగరానికి రూ.34,11,829, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.11,37,276, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.7,10,798, అనకాపల్లి జిల్లాకు రూ.23,21,938 చొప్పున కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖలో ఎన్నికల ఖర్చుకు రూ.3కోట్ల మేర అవసరమని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలను పంపింది. అయితే కేవలం రూ.80.67 లక్షలు మాత్రమే విడుదల కావడం గమనార్హం.

Related posts

గాంధీ డాక్లర్లపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

Satyam NEWS

తల్లితో సహజీవనం చేసి కూతురిపై కన్నేసి పది మందిని చంపేసి

Satyam NEWS

ఇన్ టైం ప్లీజ్:కేజ్రీవాల్ నామినేషన్ వేస్తాడా లేదా

Satyam NEWS

Leave a Comment