శ్రీకాకుళం జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఘంటసాల మండలం అవనిగడ్డలో ఒక విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు. తమ్మనబోయిన దీపక్ మణికంఠ సాయి(15)గా స్థానికులు గుర్తించారు. ఇతను జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
రాత్రి ప్రైవేటుకు వెళ్లిన దీపక్ తెల్లారేసరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే మణికంఠది హత్యా? ఆత్మహత్యా అన్నది తేలాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.